ఏసీ బస్సులు వెలవెల.. ఇద్దరు ప్రయాణికులతో భాగ్యనగరానికి, సూపర్ లగ్జరీ కూడా.. ఎందుకంటే...
సాధారణంగా ఏసీ బస్సుల్లో టికెట్ హాట్ కేకే.. టికెట్ అంతా వీజీగా దొరకదు. ఇక సమ్మర్ అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కరోనా వైరస్ వల్ల ఏసీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండ, అధిక ఉష్ణోగ్రత ఉన్న చోట కరోనా వైరస్ నిలవదు. అంతేకాదు చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు తీసుకోవద్దు. ఇక ఏసీలకు దూరంగా ఉండాలి. కరోనా వైరస్ వల్ల ఏసీ బస్సుల్లో ప్రయాణించాలంటేనే భయపడిపోతున్నారు. దీంతో ఒకరిద్దరూ ప్రయాణికులు ఉన్న సరే రాజధాని బస్సులు తిరుగుతున్నాయి.

నష్టాలకు తోడు..
అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. లాభాలబాటలో కాకున్నా.. జీతాలు, ఖర్చులు వెళితే చాలని యాజమాన్యం అనుకొంటొంది. దీనికి కరోనా వైరస్ తోడయ్యింది. హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌కు పాజిటివ్ రావడంతో.. భాగ్యనగరానికి రావాలంటేనే జనం ఆందోళన చెందుతున్నారు. అత్యవసరం ఉంటే తప్పు.. వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నిజామాబాద్ బస్టాండ్‌లో ఒకటి కాదు రెండు కాదు.. నాలుగు రాజధాని బస్సులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అదేంటి గురువారం ఏమైనా బంద్ ఉందా అనే ప్రశ్న తలెత్తింది.

ఇదీ కారణం..
హైదరాబాద్‌లో ఒక పాజిటివ్ కేసు నమోదవడంతో సిటీకి వచ్చేందుకు ప్రయాణికులు ఇష్టపడటం లేదు. అత్యవసరమైతే తప్ప.. ఇంట్లో నుంచి కాలు బయటకి తీయడం లేదు. దీంతో నిజామాబాద్ బస్టాండ్ వద్ద నాలుగు రాజధాని ఏసీ బస్సులు ఖాళీగా కనిపించాయి. ఒక బస్సులో ఇద్దరు టికెట్ తీసుకోవడంతో.. వారి కోసమే రాజధాని బస్సు బయల్దేరింది. రాజధాని ఏసీ బస్సులే కాదు.. సూపర్ లగ్జరీ బస్సు కూడా ఖాళీగా కనిపిస్తోంది.
Recommended Video


ఇక్కడ నమోదు కాలే..
మరోవైపు తెలంగాణ గడ్డ మీద ఒక్క కరోనా వైరస్ కేసు నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. ఊరికే వదంతులు వ్యాపింపజేయొద్దని సూచించారు. వైరస్ సోకిందనే ప్రచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని.. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. మైండ్ స్పేస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, అపోలో శానిటేషన్ మహిళ రిపోర్ట్ పుణె నుంచి వచ్చిందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వారిద్దరికీ నెగిటివ్ వచ్చిందని తెలిపారు. వీరే కాక 21 మందికి కూడా నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications