హైదరబాద్‌లోని ఈ ప్రాంతాల్లో నేడు వాటర్ సప్లయ్ బంద్..
హైదరబాద్ నగరవాసులకు అలర్ట్.. నేడు పట్టణంలోని ఈ ప్రాంతాల్లో మరోసారి వాటర్ సప్లయ్ బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వేసవిలో దేశంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోయిన సంగతి తెలిసిందే. సమ్మర్‌లో చాలా ప్రాంతాల్లో తాగునీటి వాటర్ ట్యాంకుల కోసం ప్రజలు పడిగాపులు కాసిన రోజులు చాలానే ఉన్నాయి. అంతెందుకు మొన్నటికి మొన్న బెంగుళూరు వంటి మహానగరాల్లో చుక్కనీరు లేక ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి వచ్చిందో అందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద నగరాల్లో ఈ మధ్యకాలంలో తాగునీటి వాటర్ ట్యాంకుల కోసం ప్రజలు చాలా సమస్యలు పడుతున్నారు. డిమాండ్ కు సరిపడా వాటర్ సప్లై లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా పైపులైన్ జంక్షన్ పనుల కారణంగా పలు ప్రాంతాల్లో వాటర్ సప్లయ్ బంద్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక, నేడు కూడా అదే పరిస్థితి దాపురించింది. నేడు (బుధవారం) నగరంలోని పలు ప్రాంతాల్లో వాటర్ సప్లయ్ బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రాంతాల్లోనే..
పటాన్ చెరులోని మంజిరా ఫేజ్ 1 పైప్‌లైన్ వాల్వ్ జంక్షన్ వద్ద రిపేర్లు కారణంగా నేడు (బుధవారం) నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను బంద్ చేస్తున్నట్లు వాటర్ బోర్డ్ అధికారులు వెల్లడించారు. బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్, అశోక్‌నగర్, పటాన్‌చెరు, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదినాగూడ, హఫీజ్ పేట, ఎస్‌బిఐ ట్రైనింగ్, హెచ్‌సియు, ఇండస్ట్రీయల్ ఏరియా, ఆర్సీపురం వంటి తదితర ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని అధికారులు స్పష్టం చేశారు. పైపులైన్ పనులు పూర్తికాగానే నీటి సరఫరాను పునరుద్దరిస్తామని అధికారులు పేర్కొన్నారు. నగరవాసులకు శుద్ధమైన తాగునీటిని అందించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వాటర్ బోర్డ్ అధికారులు వివరించారు.













Click it and Unblock the Notifications