నోట్లు మారుస్తున్న మావోలు: 12లక్షలు సీజ్, ఇద్దరి అరెస్ట్
మావోయిస్టులు ఇచ్చిన డబ్బులను మార్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
భద్రాచలం: మావోయిస్టులు ఇచ్చిన డబ్బులను మార్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి జిల్లాలోని చర్ల మండలం అటవీ ప్రాంతంలో గజా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో త్రినాథరావు డిప్యూటీ ప్రాజెక్టు మేనేజరుగా, సిద్ధార్థ్ అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

కాగా, గుర్తుతెలియని వ్యక్తులు కొందరు వారి వద్దకు వచ్చి తమనుతాము మావోయిస్టులుగా పరిచయం చేసుకున్నారు. తమ వద్ద ఉన్న పెద్దనోట్లను మార్చి ఇవ్వాలని వారిని కోరుతూ రూ.12 లక్షలు అప్పగించారు. ఈ క్రమంలో అసిస్టెంట్ ఇంజినీర్ సిద్ధార్థ్‌కు మంథన్‌గోడ్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ సత్యనారాయణాచారితో పరిచయం ఉండటంతో అతడిని కలిసి.. 15 శాతం కమిషన్‌పై నోట్లను మార్చేందుకు ఒప్పందం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి త్రినాథ్‌రావు, సిద్ధార్థ్‌లు డబ్బులు పట్టుకుని మంథన్‌గోడ్ చేరుకున్నారు. విషయం కాస్తా పోలీసులకు చేరడంతో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications