ఎన్ ఆర్ ఐ హత్యకేసు:సెల్ ఫోన్ ను స్వాధీనం, వివాహేతర సంబంధమే కారణం?
వివాహేతర సంబంధాల కారణంగా హత్యకు గురైన ఎన్ఆర్ ఐ సయ్యద్ ఇమ్రాన్ ఫోన్ ను పోలీసులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకొన్నారు. మృతుడు ఇమ్రాన్ అదృశ్యమైన నాటి నుండి ఇమ్రాన్ ఫోన్ కూడ దొరకలేదు.
హైదరాబాద్:వివాహేతర సంబంధాల కారణంగా హత్యకు గురైన ఎన్ఆర్ ఐ సయ్యద్ ఇమ్రాన్ ఫోన్ ను పోలీసులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకొన్నారు. మృతుడు ఇమ్రాన్ అదృశ్యమైన నాటి నుండి ఇమ్రాన్ ఫోన్ కూడ దొరకలేదు.
ఎన్ ఆర్ ఐ సయ్యద్ ఇమ్రాన్ ను వివాహేతర సంబందాలున్నాయనే నెపంతో సైఫ్ బిన్ బారాబూద్ అతని సోదరుడు సయిాద్ సాబిద్ బారాబూద్ లు హత్య చేశారు.
ఈ మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.అయితే మృతుడు ఇమ్రాన్ కు చెందిన కొన్ని వస్తువులు అదృశ్యమయ్యాయని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

మృతుడి సెల్ ఫోన్ దొరికితే హత్యకు మరింతగా హత్యకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుందని పోలీసులు భావించారు. ఈ మేరకు ప్రధాన నిందితుడి భార్య ఫాతిమాను కూడ పోలీసులు అరెస్టు చేశారు.
మృతుడికి సంబంధించి అదృశ్యమైన వస్తువులను స్వాధీనం చేసుకొనే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ మేరకు మృతుడికి చెందిన సెల్ ఫోన్ ను పోలీసులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకొన్నారు.
ఈ ఏడాది జనవరి 4వ, తేదిన మెహిదీపట్నం రైతుబజార్ వద్ద అదృశ్యమయ్యాడు. ఆయనను ఫాతిమా భర్త, అతని సోదరుడు హత్య చేశారు. బండ్లగూడలోని ఇంట్లోనే పూడ్చిపెట్టారు.హత్యకు గల పూర్తి వివరాలను సేకరించేందుకుగాను ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. ఇందులో భాగంగానే సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొన్నారు.












Click it and Unblock the Notifications