హైదరాబాద్‌లో విషాదం: ప్రమాదంలో టెక్కీ మృతి, తట్టుకోలేక స్నేహితుడు రైలు కిందపడి ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని మూసాపేటలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ప్రాణ స్నేహితుడు మృతి చెందడంతో అతడి మరణాన్ని తట్టుకోలేక పక్కనే ఉన్న భరత్ నగర్‌లోని రైలు కిందపడి మరో స్నేహితుడు ఆత్మహత్మ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే...

హరికృష్ణ, రమేశ్ స్నేహితులు. ఒకే గ్రామానికి చెందిన వీరిద్దరూ చిన్నతనం నుంచే కలిసి చదువుకున్నారు. హరికృష్ణ నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రమేష్ శ్రీ శ్రీ హోలిస్టిక్ ఆసుపత్రిలో ఉద్యోగి. వీరిద్దరూ కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు.

బుధవారం రాత్రి అమీర్ పేటలో ఉన్న తన స్నేహితుడిని కలిసేందుకు వచ్చారు. తిరిగి వెళ్తున్న క్రమంలో మూసాపాటలోని గూడ్స్ షెడ్ రోడ్డులో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు స్నేహితుల వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదం బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమీపంలో చోటు చేసుకంది.

One killed in Road Accident at Moosapet on Wednesday

ఈ ఘటనలో బైక్‌పై వెనక కూర్చున్న హరికృష్ణ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో స్నేహితుడి మరణం బైక్ నడిపిన రమేష్(28)ను కుంగదీసింది. తన కళ్ల ముందే ప్రాణ స్నేహితుడు చనిపోవడంతో ఏం చేయాలో అతడికి తోచలేదు. తన స్నేహితుడు చనిపోయిన కొద్దిసేపటికే భరత్‌నగర్‌లో రైలు పట్టాల దగ్గరకు రమేశ్ వెళ్లాడు.

స్నేహితుడి లేని జీవితం ఊహించుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులిద్దరూ గుంటూరు జిల్లాలోని కారంపూడి మండలం వేపకంపల్లి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

One killed in Road Accident at Moosapet on Wednesday

ఇక సాప్ట్‌వేర్ ఇంజనీర్ అయిన హరికృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతే పోస్టుమార్టం చేస్తామని వైద్యులు తెలిపారు. దీంతో వారు ఉంటున్న హస్టల్‌తో పాటు వేప‌కంప‌ల్లి గ్రామంలో విషాదం నెల‌కొంది.

అర్ధరాత్రి సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరగడంతో స్థానికులు ఎవరూ ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూడలేదు. అయితే రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి సమీపంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తే వేగంగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

రంగంలోకి దిగిన పోలీసులు లారీ డ్రైవర్‌తో లారీని అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రమేశ్ నెలక్రితమే మలేషియా నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+