హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిస్స్‌డ్ కాల్ ఓ విద్యార్ధి జీవితాన్నే మార్చేసింది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఖమ్మం జిల్లా మధిరకు చెందిన వేణు డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. తన మొబైల్ నుంచి డయల్ చేసిన నెంబర్ తప్పని గుర్తించి వెంటనే కట్ చేశాడు. తాను చేసిన ఆ తెలియన్ నెంబర్ తన జీవితాన్నే మార్చేస్తుందని అప్పుడు అతనికి తెలియదు.

వేణు ఇచ్చిన మిస్స్‌డ్ కాల్ భర్తను కోల్పోయి పిల్లలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న ఇల్లెందుకు చెందిన యువతి రమకు వెళ్లింది. మిస్స్‌డ్ కాల్ చూసుకొన్న రమ తిరిగి వేణుకి ఫోన్ చేసింది. ఇంకేముంది మగ దిక్కులేని రమ, వేణు మాటలకు మాట కలిపింది.

One Missed Call Change her Life

వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. ఇలా కొన్ని రోజులు ఫోన్‌లో మట్లాడుతున్న ఇద్దరూ కలుసుకోవాలని భావించారు. ఇందులో భాగంగా రమ ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్లిన వేణుని ఆమె అత్తమామలు, బస్తీ వాసులు నిర్బంధించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించడంతో, వేణు తల్లిదండ్రులకు తెలియకుండా రమను వివాహం చేసుకుంటానని అంగీకరించాడు. దీంతో ఇల్లెందు పెద్దలు సమీపంలోని సమ్మక్క దేవాలయంలో ఇద్దరికీ వివాహం జరిపించారు.

దీనిని బట్టి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, తెలియని ఫోన్ నెంబర్లకు పొరపాటున కూడా మిస్స్‌డ్ కాల్స్ ఇవ్వొద్దు. మిస్స్‌డ్ కాల్స్ కొంత మంది జీవితాలను అభివృధ్దిపథంలోకి తీసుకెళ్తే, మరికొంత మందిని అథఃపాతాళానికి తీసుకెళ్తాయి.

English summary
One Missed Call Change her Life in Ilendhu village in Khammam District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X