హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో జనవరి 24 నుంచి ఆన్‌లైన్ తరగతులు: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు పొడిగించిన రాష్ట్ర విద్యాశాఖ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 24 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని 8,9,10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇక, పాఠశాలలకు హాజరయ్యే ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది కూడా రోటేషన్ పద్ధతిలో 50 శాతం మంది మాత్రమే విధులకు హాజరుకావాలని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు అమలయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

Online classes starts from January 24 in telangana

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ.. ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 4 వరకు గడువు పొడిగించినట్లు తెలిపింది. ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 24 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. రూ. 200 ఆలస్య రుసుంతో చెల్లించేవారు ఫిబ్రవరి 10 వరకు, రూ. 1000 ఫైన్ తో చెల్లించేవారికి ఫిబ్రవరి 17 వరకు, రూ. 2000 రూపాయల ఫైన్ తో చెల్లించేవారు ఫిబ్రవరి 24 వరకూ చెల్లించవచ్చని బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.
కాగా, గతంలో జనవరి 24 లోపల ఫీజు చెల్లించాలని బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే.

తెలంగాణలో ఐఏఎస్, 12 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లకు ప్రభుత్వం పోదన్నతి కల్పించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలోని 12 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పించారు. 2004 బ్యాచ్‌కు చెందిన తరుణ్ జోషి, శివకుమార్‌కు ఐజీలుగా పదోన్నతి కల్పించారు. కమలాసన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్‌కు ఐజీలుగా పదోన్నతి పొందారు.
2009 బ్యాచ్ కు చెందిన అంబర్ కిషోర్ జా, రెమా రాజేశ్వరి సెలెక్షన్ గ్రేడ్‌కు పదోన్నతి కల్పించారు. 2008 బ్యాచ్ కు చెందిన ఇక్బాల్.. డీఐజీగా పదోన్నతి పొందారు. 1997 బ్యాచ్ కు చెందిన నలుగురు ఐపీఎస్‌లకు అడిషనల్ డీజీగా ప్రమోషన్ ఇచ్చారు. విజయ్ కుమార్, నాగిరెడ్డి, దేవేంద్రసింగ్ చౌహాన్, సంజయ్ కుమార్ జైన్‌కు పదోన్నతి కల్పించారు.

1997 కేడర్‌కు చెందిన శైలజా రామయ్యార్, అహ్మద్ నదీమ్, ఎస్ శ్రీధర్, ఎం వీరబ్రహ్మయ్యను ముఖ్య కార్యదర్శులుగా పోదన్నతి కల్పించింది. ప్రస్తుతం వారు కొనసాగుతున్న చోటనే కొనసాగించింది. 2009 బ్యాంచ్ కు చెందిన సర్ఫరాజ్ అహ్మద్, ఎస్ సత్యనారాయణ, హర్విందర్ సింగ్, ఎం ప్రశాంతికి సెలెక్షన్ గ్రేడ్ పదోన్నతి కల్పించారు. శశాంక, శ్రుతి ఓజా, శివలింగయ్య, వెంకటేశ్వర్లు, హనుమంతరావు, అమోయ్ కుమార్, హైమావతి, హరితలకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ పదోన్నతి లభించింది.

English summary
Online classes starts from January 24 in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X