జిహెచ్ఎంసి ఎన్నికలకూ కెసిఆర్ అదే ప్లాన్: ప్రతిపక్ష నేతల్లో భయం?
హైదరాబాద్: ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఏకగ్రీవంగా దక్కించుకోవడంతో ప్రతిపక్షాలు కంగు తిన్నాయి. ఇదే విధమైన వ్యూహాన్ని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుసరించే ప్రమాదం ఉంటుందని ఆందోళనకు గురవుతున్నాయి. హైదరాబాదుపై నియంత్రణ కోసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించిన ఆపరేషన్‌నే టిఆర్ఎస్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో అనుసరిస్తే ఏం చేయాలనే ఆందోళనలో పడినట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు హైదరాబాదు ప్రజలు ఓటేస్తారని టిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించడానికి తమ పార్టీ అభ్యర్థుల చేత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగా నామినేషన్లు ఉపసంహరింపజేసే వ్యూహాన్ని టిఆర్ఎస్ అనుసరించవచ్చునని అంటున్నారు.

బీ ఫారాలు తీసుకుని నామినేషన్లు వేసి, ఆ తర్వాత ఉపసంహరించుకునే అభ్యర్థులు ఉంటారనే అనుమానాలు ఇప్పటి నుంచే ప్రతిపక్షాలను పట్టి పీడిస్తోంది. అది అనైతికమని అంటున్నప్పటికీ అదే పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలనే విషయంపై కాంగ్రెసు, బిజెపి, తెలుగుదేశం పార్టీలకు తోచడం లేదు.
తమకు హైదరాబాద్ ఎన్నికల్లో 70 స్థానాలు వస్తాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు చెబుతుండగా, 75 నుంచి 80 సీట్లు వస్తాయని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అంటున్నారు. జిహెచ్ఎంసిలో 150 డివిజన్లు ఉన్నాయి. ఆ మాత్రం సీట్లు వస్తే మేయర్ పదవి టిఆర్ఎస్‌కు దక్కడం ఖాయమవుతుంది.
టిఆర్ఎస్ ప్యాకేజీల ద్వారా ప్రతిపక్షాల అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేసి మేనేజ్ చేస్తుందనే విమర్శలు వస్తున్ాయి. హరీష్ రావు, కెటిఆర్ ప్రకటనలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయని ప్రతిపక్షాల నాయకులు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications