మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్‌ను అడ్దుకోవాల్సిందే : ఓయూ జేఏసీ, 'కక్ష సాధించాలని చూస్తే ఆమరణ దీక్షే'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్బావ ధినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించతలపెట్టిన జన జాతరకు ఖచ్చితంగా హాజరవుతానని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, జరుగుతున్న పరిణామాలు రేవంత్ కి ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో
రేవంత్ ఉస్మానియా క్యాంపస్ లో అడుగుపెట్టడం సాధ్యపడుతుందా..! లేదా..! అన్నదానిపై సందేహాలు తలెత్తుతున్నాయి.

రేవంత్ రెడ్డిని ఉస్మానియా జనజాతరకు రాకుండా చూడాలని ఓయూ విద్యార్ధి జేఏసీ ఛైర్మన్ బాలరాజు మానవహక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) కు పిటిషన్ సమర్పించారు. రేవంత్ రెడ్డి వర్సిటీ ప్రాంగణంలో అడుగుపెడితే, శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశమున్న నేపథ్యంలో రేవంత్ రాకను ఎలాగైనా అడ్డుకోవాలని, ఇందుకోసం పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని హెచ్ఆర్సీ కీ విన్నవించారు.

ou jac complaint to hrc on revanth reddy

బాలరాజు పిటిషన్ నేపథ్యంలో రేపు ఉస్మానియాలో జరగబోయే జనజాతరపై టెన్షన్ నెలకొంది.

కక్ష సాధించాలని చూస్తే ఆమరణ దీక్షే : రేవంత్

మెదక్ : తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రామాలపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుల విషయంలో నిర్వాసితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించిన ఆయన మల్లన్న సాగర్ నిర్వాసితులకు కేసీఆర్ ఫామ్ హౌజ్ భూములను పంచివ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణను మళ్లీ గడీల తెలంగాణగా మారుస్తున్నారని కేసీఆర్ పై మండిపడ్డ రేవంత్, గ్రామాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని విమర్శించారు. తెలంగాణ పాలనకు అద్దం పట్టడానికి ఏటిగడ్డ కిష్టాపూర్ నిర్వాసితులను చూస్తే చాలని, టీఆర్ఎస్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. గ్రామాలపై కక్ష సాధించాలని చూస్తే కిష్టాపూర్ లో ఆమరణ దీక్షకైనా సిద్దమేనన్నారు.

కేవలం ఆంధ్రా కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే తెలంగాణ ప్రజలను రోడ్డున పడేస్తున్నారని ఆరోపించారు. వచ్చే 15 రోజుల్లో సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయకపోతే కిష్టాపూర్ లో 48 గంటల ఆమరణ దీక్ష చేస్తానని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

అలాగే బంగారు తెలంగాణ అంటూ ప్రజలను నమ్మించిన ప్రొఫెసర్ కోదండరామ్, హరగోపాల్, విమలక్క, కిష్టాపూర్ ని సందర్శించి అక్కడి ప్రజల సమస్యలను వినాల్సిందిగా సూచించారు.

English summary
ou jac chairman balaraju complained to hrc to oppose the revanth reddy visit into osmania campus for the jana jathara program
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X