రూ.20 లక్షల వార్షిక వేతనం: ఓయూ విద్యార్థికి భారీ ఆఫర్
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి ఒకరికి బంపర్ ఆఫర్ వచ్చింది. ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణ నియామాల్లో (క్యాంపస్ ఇంటర్వ్యూ) కె సతీష్ రెడ్డి అనే విద్యార్థికి రూ.20 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం లభించింది.
కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని డీఈషా అండ్ కంపెనీలో ఎంపిక చేసుకున్నారు. సతీష్ రెడ్డి తండ్రి రామచంద్రా రెడ్డి భవన నిర్మాణ సంస్థలో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. తల్లి స్వర్ణలత ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో టైంస్కేల్ ఉద్యోగిని.

డీఈషా కంపెనీ హాంకాంగ్, షాంఘై, టోక్యో తదితర ప్రపంచ నగరాల్లో పెట్టుబడుల నిర్వహణను చేపడుతోంది. సతీష్ రెడ్డికి కళాశాల ప్రిన్సిపల్, ఇతర అధ్యాపకులు అభినందనలు తెలిపారు. ఇంటర్వ్యూలో నలుగురు విద్యార్థులు హాజరు కాగా, సతీష్ రెడ్డి ఉద్యోగం పొందినట్లు డైరెక్టర్ ఉమామహేశ్వర్ చెప్పారు.












Click it and Unblock the Notifications