కాంగ్రెస్-బీజేపీ-కాంగ్రెస్: దామోదర సతీమణి సంచలన నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయమే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన ఆమె కొద్దిగంటల్లోనే ఆ పార్టీని వీడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

కాంగ్రెస్ కార్యకర్తల మనోవేదన చూసి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని, తిరిగి కాంగ్రెస్ గూటికే చేరినట్టు పద్మినీరెడ్డి వెల్లడించారు. ఆమె ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాను బీజేపీలో చేరడంవల్ల ఇంత భారీ స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి స్పందన వస్తుందని తాను ఊహించలేదన్నారు. కాగా, దామోదర రాజనర్సింహకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి చేరినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications