Hyderabad: పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు అరెస్ట్..!

పంజాగుట్ట మాజీ సీఐని పోలీసులు అదుపులోకి తీసకున్నారు. పరారీలో ఉన్న దుర్గారావును పట్టుకున్నారు. ఆయన్ను అనంతపురం గుంతకల్ల రైల్వే స్టేషన్ లో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కేసులో దుర్గా రావు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు పారిపోయేందుకు దర్గారావు సహకరించినటలు పోలీసుల విచారణలో తేలింది.

దీంతో సీఐ దుర్గారావును హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. ఇదే కేసులో బొదన్ సీఐ ప్రేము కుమార్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ్ కుమార్ షకీల్ కొడుకు విదేశాలకు వెళ్లేందుకు సహరించినట్లు తెలిసింది. దుర్గారావును సస్పెండ్ చేసిన తర్వాత ఆయన పరారీలో ఉన్నారు. చిరవరికి దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద షకీల్ కొడుకు సోహెల్ నిర్లక్ష్యంగా అత్యంత వేగంగా కారు నడిపి బారికేడ్లను ఢీకొట్టాడు.

 Panjagutta former CI Durga Rao has been arrested by the police

పంజాగుట్ సీఐ సోహెల్ కు బదులు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి సీఐని సస్పెండ్ చేశారు. 17 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సోహెల్ గతంలో కూడా రాష్ డ్రైవింగ్ చేసి ఒకరి మరణానికి కారణమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు షకీల్ ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండడంతో సోహెల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

బేగంపేట ప్రజాభవన్ వద్ద సోహెల్ నిర్లక్ష్య డ్రైవింగ్ కేసులో పోలీసులు బలిపశువులుగా మారారు. దుర్గారావు షకీల్ చెప్పినట్లు వినడంతో మొదటికే మోసం అయినట్లు తెలుస్తోంది. కొంత మంది పోలీసులు అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు తొత్తులుగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత బుక్ అయి పోతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+