పేపర్ లీక్ సూత్రధారి బీజేపీ.. బండి సంజయ్; భగ్గుమన్న బీఆర్ఎస్ మంత్రులు
పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న గందరగోళం వెనుక బిజెపి హస్తం ఉందని బీఆర్ఎస్ పార్టీ మంత్రులు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేపర్ లీకేజీ వెనుక బండి సంజయ్ ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
కేసిఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ఉద్దేశం: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, 10వ తరగతి పేపర్ లీక్ సూత్రధారి బీజేపీ బండి సంజయ్ అన్నారు. అన్ని రకాల ఆధారాలు లభించాయని, లక్షల మంది పిల్లలు భవిష్యత్తు,వారి తల్లి తండ్రులు ఎంత బాధ పడతారు అని కనీస బాధ్యత లేకుండా బండి సంజయ్ ప్రవర్తించాడని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసిఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశం అని ప్రశాంత్ అనే వ్యక్తి, బండి సంజయ్ కి ఫోటో తీసిన పేపర్ ఫోన్లో పంపారని ఆరోపించారు.

బీజేపీ ఉద్దేశపూర్వకంగా ప్రశ్నాపత్రాల లీక్ : పరీక్ష మొదలైన 15 నిమిషాల్లోనే బండి సంజయ్ కు ప్రశాంత్ ద్వారా ప్రశ్నాపత్రం వచ్చిందన్నారు. బండి సంజయ్, బీజేపీ వాళ్ళతో 140 ఫోన్ కాల్స్ ప్రశాంత్ మాట్లాడినట్టుగా పోలీసులు చెప్పారని, ఇది కావాలని వాళ్లే ఉదేశపూర్వకంగా లీక్ చేసి, వాళ్లే మీడియాకు పంపించారని వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఇక ఆపై పరీక్ష పేపర్ లీక్ అయిందని, ఆ పేపర్ తనకు వచ్చిందని ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం పై మాటలు దాడి చేసినట్టుగా వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.
కేసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేస్తే ఖబర్దార్: ఇది పిల్లల జీవితాలతో చెలగాటం ఆడటమే అన్నారు. ఈ వ్యవహారంలో బండి సంజయ్ పాత్ర ఉన్నదని పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి. చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బండి అరెస్ట్ పై బీజేపీ నాయకులు కేసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేస్తే ఖబర్దార్...భౌతిక దాడులు తప్పవన్నారు. పేపర్ లీక్ చేసి పిల్లల భవిష్యత్ ను నాశనం చేయాలని చూసిన బీజేపీ బండి సంజయ్ వైఖరి పట్ల బీజేపీ కార్యకర్తలు ఆలోచన చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు.

బండి సంజయ్ ను తక్షణమే అధ్యక్ష పదవి నుండి తొలగించాలి: మంత్రి జగదీశ్ రెడ్డి: ప్రశ్న పత్రాల లీకేజీలో అడ్డంగా దొరికిపోయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తక్షణమే అధ్యక్ష పదవి నుండి తొలగించి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రశ్నా పత్రాల లీకేజీలో రాజకీయ పార్టీ పాత్ర ఉండటం దురదృష్టకరం అన్నారు. తప్పు చేసి అడ్డంగా దొరికినా కూడా బీజేపీ నాయకులు బండి సంజయ్ ని సమర్ధించడం సిగ్గు చేటని మంత్రి ఎద్దేవా చేశారు. పేపర్ లీకులతో పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారని అన్నారు.
బిజెపి క్షుద్ర రాజకీయ క్రీడ: ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశ్యం తో బిజెపి క్షుద్ర రాజకీయ క్రీడకు తెరలేపింది అన్నారు. విద్యార్థులు , నిరుద్యోగులు బీజేపీ ట్రాప్ లో పడొద్దని మంత్రి కోరారు.విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ ని గ్రామగ్రామాన ప్రజలు నిలదీయాలి అని పిలుపునిచ్చారు.యువత , విధ్యార్ధులను బీఆర్ఎస్ నుండి దూరం చేసే కుట్ర జరుగుతుందన్న మంత్రి ఈ కుట్రను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలన్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications