వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల ఎవరు బెస్ట్? తెలంగాణాలో జనసేన పోటీతో హాట్ డిబేట్!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రంగంలోకి దిగుతున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో 32 నియోజకవర్గాలలో కార్యనిర్వాహకులను ఎంపిక చేసి కార్యాచరణ మొదలుపెట్టినట్టు జనసేన ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ పై ఆసక్తికర చర్చ జరుగుతుంది. జనసేన పార్టీని వైయస్ షర్మిల పార్టీని పోలుస్తూ చర్చ జరుగుతున్న తీరు ఆసక్తికరంగా మారింది.

ఏపీలో ఎదురీదుతున్న పవన్ కళ్యాణ్; తెలంగాణాలో జనసేన పోటీ అవసరమా సామి?ఏపీలో ఎదురీదుతున్న పవన్ కళ్యాణ్; తెలంగాణాలో జనసేన పోటీ అవసరమా సామి?

 జనాకర్షణ ఉన్నా రాజకీయాల్లో రాణించలేకపోతున్న పవన్ కళ్యాణ్

జనాకర్షణ ఉన్నా రాజకీయాల్లో రాణించలేకపోతున్న పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని 2014 మార్చిలో ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ కు ప్రజలలో తరగని జనాకర్షణ ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఆయన రాణించలేకపోయారు. 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీలో లేదు. ఇక 2019 ఎన్నికల సమయానికి వామపక్ష పార్టీల పొత్తుతో బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఘోర పరాజయం పాలవడమే కాకుండా, పార్టీ నుండి ఒకే ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఆ స్థానం నుండి గెలిచిన ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట వినడం లేదు.

 తెలంగాణాలో జనసేన పోటీ.. అందరిలో చర్చ

తెలంగాణాలో జనసేన పోటీ.. అందరిలో చర్చ


రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు చేసిందేమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కు పార్టీ కార్యకలాపాలు కూడా లేవు. జనసేన పార్టీ తరఫున చేసిన చిన్న ధర్నా గాని, ఆందోళన కానీ అసలు కనిపించవు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ నాయకులు ఉన్నారు అన్న విషయం కూడా ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉంది. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ పార్టీ వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తుందని చెప్పడం ఒక్కసారిగా అందరి దృష్టిని జనసేన పార్టీ గురించి ఆలోచించేలా చేస్తోంది.

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా దూకుడుగా తెలంగాణాలో ఉన్న పార్టీ షర్మిల పార్టీ

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా దూకుడుగా తెలంగాణాలో ఉన్న పార్టీ షర్మిల పార్టీ


ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో 2021 జూలై 8 వ తేదీన పార్టీని ఏర్పాటు చేశారు వైయస్ షర్మిల. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాను అంటూ తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిల నిదానంగా దూకుడు పెంచారు. ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీ తో బలంగా తలపడుతున్న స్థాయికి వైయస్ షర్మిల ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ప్రజాక్షేత్రంలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, కెసిఆర్ కుటుంబ పాలన పై విమర్శలు గుప్పిస్తూ, స్థానిక నాయకుల అవినీతిని ప్రశ్నిస్తూ ముందుకు సాగుతున్నారు వైయస్ షర్మిల. ఇక వైఎస్ షర్మిల దూకుడు ను అడ్డుకోవడానికి అధికార పార్టీ నానా తంటాలు పడాల్సి వస్తోంది.

తెలంగాణాలో పోటీ.. పవన్ కళ్యాణ్ తప్పు నిర్ణయమా?

తెలంగాణాలో పోటీ.. పవన్ కళ్యాణ్ తప్పు నిర్ణయమా?


ఇక ఇదే సమయంలో తెలంగాణలో పోటీ చేస్తానంటున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కంటే, వైయస్ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ బెస్ట్ అని ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని విస్తరించటంలో విఫలమయ్యారు. పార్టీ కార్యకలాపాలను నిర్వహించడంలో, పార్టీ కీలక నాయకులను గుర్తించడంలో, ప్రభుత్వంపై పోరాటంలో వెనక ఉండి పోయారు. ఇక ఈ సమయంలో తెలంగాణలో పోటీ చేయాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ తీసుకున్న తప్పుడు నిర్ణయం గా భావిస్తున్న పరిస్థితి లేకపోలేదు.

 తెలంగాణాలో షర్మిల పార్టీ కన్నా వెనుకే జనసేన

తెలంగాణాలో షర్మిల పార్టీ కన్నా వెనుకే జనసేన

ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలంగా తలపడుతూ కూడా, రాష్ట్రంలో పట్టు సాధించలేక పోతున్న పవన్ కళ్యాణ్, అసలు ఏమాత్రం పట్టు లేని తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడం దండగ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోటీ చేసి పవన్ కళ్యాణ్ అభాసుపాలు కావడం తప్ప సాధించేది ఏమీ లేదు అన్న భావన వ్యక్తమౌతుంది. ఏది ఏమైనా తాజా పరిస్థితులలో తెలంగాణలో పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ పార్టీ కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ది బెస్ట్ అన్న టాక్ వినిపిస్తుంది. పవన్ పార్టీ పోటీ చేస్తే పరువు పోగొట్టుకుంటుంది, షర్మిల పార్టీ కన్నా వెనక ఉండిపోతుంది అన్న చర్చ జరుగుతుంది.

English summary
There is talk that YS Sharmila's YSRTP is better than Pawan Kalyan's Janasena in Telangana. This discussion will be held in the context of the announcement that the Jana Sena will contest in Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X