తలసానికి షాకిచ్చేనా: సనత్‌నగర్ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ యోచన?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సనత్ నగర్ నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారా? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సనత్ నగర్ నుండి గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు.
ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా పైన సభాపతి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాజీనామాను స్పీకర్ ఆమోదించాక ఉప ఎన్నికలు వస్తాయి. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి తలసాని పోటీ చేస్తారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా పోటీపై అప్పుడే సిద్ధమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8, ఓటుకు నోటు అంశాలపై స్పందించిన పవన్ కళ్యాణ్ సనత్ నగర్ నుండి పోటీ చేసే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనే జనసేన పార్టీ పోటీ చేస్తుందని భావించినా అది జరగలేదు.
ఇప్పుడు పవన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ మంత్రి తలసాని పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని పార్టీ మారి సనత్ నగర్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలరా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications