Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొండగట్టుకు పవన్ కళ్యాణ్; వారాహికి పూజల వేళ.. తెలంగాణాలో జనసేన జోష్!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు కొండగట్టులో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఎన్నికల ప్రచార రథమైన వారాహి వాహనానికి పూజలు చేయించనున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి కొండగట్టు ఆలయానికి బయలుదేరారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఎంతో సెంటిమెంట్. ఇక ఈ ఆలయంలోని స్వామివారిని పూజించుకొని తన ఎన్నికల సమరాన్ని సాగించడానికి, తాను ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

 పవన్ కళ్యాణ్ పర్యటనతో జనసైనికుల్లో జోష్

పవన్ కళ్యాణ్ పర్యటనతో జనసైనికుల్లో జోష్

ఇక తెలంగాణ రాష్ట్రంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో కొండగట్టుకు బయలుదేరారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తికాగా, తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై నేడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గ కార్యనిర్వాహక సభ్యులతో సమావేశం కానున్న నేపథ్యంలో వారిలోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.

వారాహి పూజలు ..ఆపై తెలంగాణా 32 నియోజకవర్గాల కార్యనిర్వాహక సభ్యులతో భేటీ

వారాహి పూజలు ..ఆపై తెలంగాణా 32 నియోజకవర్గాల కార్యనిర్వాహక సభ్యులతో భేటీ

ఈరోజు ఆంజనేయ స్వామి ఆలయంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ వారాహి వాహనానికి పూజలు చేయించిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రచార రధాన్ని ప్రారంభిస్తారు. ఆపై పవన్ కళ్యాణ్ నాచుపల్లి సమీపంలోని ఒక రిసార్ట్ లో తెలంగాణా జనసేన ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. తెలంగాణలో జనసేన పార్టీ కార్యాచరణ పై ముఖ్య నాయకులకు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేస్తారు. దీంతో ఇప్పటికే 32 నియోజకవర్గాల కార్యనిర్వాహక సభ్యులు పవన్ కళ్యాణ్ కొండగట్టు టూర్ నేపథ్యంలో కొండగట్టుకు చేరుకున్నారు.

ఈరోజు పర్యటన షెడ్యూల్ ఇలా

ఈరోజు పర్యటన షెడ్యూల్ ఇలా


ఈరోజు ఉదయం 11 గంటలకు మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ జనసేన పార్టీ నేతలతో సమావేశం అవుతారు. ఆపై 3.30 నిమిషాలకు ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ధర్మపురి నుండి అనుస్టుప్ నరసింహ యాత్రను చేపట్టనున్నారు. ఈ నరసింహ యాత్ర ద్వారా ఆయన 32 నరసింహ క్షేత్రాల సందర్శనను చెయ్యనున్నారు.

 ఎన్నికల సమరానికి రెడీ అవుతున్న వారాహి.. అందరిలో ఉత్కంఠ

ఎన్నికల సమరానికి రెడీ అవుతున్న వారాహి.. అందరిలో ఉత్కంఠ


ఇక ఆపై 5 గంటల 30 నిమిషాలకు తిరిగి హైదరాబాద్ ప్రయాణం కానున్న పవన్ కళ్యాణ్ రాత్రికి హైదరాబాద్ కి చేరుకుంటారు. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ పర్యటన తెలంగాణా రాష్ట్రంలో జనసేన పార్టీ నేతలలో జోష్ నింపుతుండగా, ఎన్నికల సమరానికి రెడీ అవుతున్న వారాహి విషయంలో ముందు ముందు ఏం జరగబోతుంది అనేది మాత్రం ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+