రేపు కొండగట్టు అంజన్నను దర్శించుకుంటా, అక్కడి నుంచే రాజకీయం, రోడ్డు షో: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనాల్లోకి వస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆదివారం తెలిపారు. ఆయన తన సమీప భవిష్యత్తు ప్రణాళికపై మాట్లాడారు.
తాను సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటానని చెప్పారు. 2009లో తనకు ఆయన వల్లే ప్రమాదం తప్పిందని చెప్పారు. అందుకే రాజకీయాలను ఇక్కడి నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

తెలంగాణలో తాను మూడు నాలుగు జిల్లాల్లో పర్యటిస్తానని పవన్ చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తానని చెప్పారు. అవసరాన్ని బట్టి రోడ్డు షో, నడవడం చేస్తానని చెప్పారు. పాదయాత్రతో జనాన్ని ఎక్కువగా కలుసుకోలేమని చెప్పారు.












Click it and Unblock the Notifications