పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం.. అంత్యక్రియలు ఎప్పుడంటే

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్ను మూశారు. సరిగ్గా 12 గంటల 51 నిమిషాలకు నర్సంపేట మాజీఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. గత ఆదివారం నుండి పెద్ది సుదర్శన్ రెడ్డి చావు బతుకుల కొట్టుమిట్టాడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నాడీవ్యవస్థ పూర్తిగా పనిచేయకపోవడంతో విఫలయత్నాలు చేసిన వైద్యులు చివరకు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించినట్టు వెల్లడించారు.

తుది శ్వాస విడిచిన పెద్ది సుదర్శన్ రెడ్డి

గత ఆదివారం నుండి వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న అర్ధరాత్రి తుది శ్వాస విడిచినట్టు ప్రకటించారు.నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమనేత పెద్ది మృతితో అభిమానులు, కార్యకర్తలు, బంధువులు శ్రేయోభిలాషులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పార్ధివ దేహాన్ని వరంగల్ జిల్లాకు తరలించారు . హన్మకొండలోని అదాలత్ దగ్గర 7గంటలకు సుదర్శన్ రెడ్డికి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత నర్సంపేటకు తీసుకువెళ్తారు.

Peddi Sudarshan Reddy died at Yashoda Hospital After Critical Illness ex mla funerals at narsampet

గత ఆదివారం నుండి వెంటిలేటర్ మీదే పెద్ది

గత ఆదివారం నర్సంపేటలో ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలిపోవడంతో పెద్ది సుదర్శన్ రెడ్డిని హుటాహుటిన రోహిణి హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్యులు గుండెపోటుగా, సిపిఆర్ చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి కి హార్ట్ బీట్ తెప్పించారు. ఆ తర్వాత ఆయనను మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. యశోద ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద పెద్ది సుదర్శన్ రెడ్డి గత ఆదివారం నుండి చికిత్స పొందుతున్నారు

హార్ట్ బీట్ 45 నిమిషాలు ఆగిపోవటం వల్ల నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తిందన్న వైద్యులు

అయితే ఈ క్రమంలో వైద్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కి హార్ట్ ఎటాక్ రాలేదని, ఆయన హిమోగ్లోబిన్ ఎక్కువ కావడం వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ తో, అది హార్ట్ లోని ఒక వాల్ బ్లాక్ చేసిందని దానివల్ల ఆయన కుప్పకూలి పోయారని ప్రకటించారు. గత ఆదివారం నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి హార్ట్ బీట్ 45 నిమిషాలు ఆగిపోయిందని దానివల్ల మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి నాడీ వ్యవస్థ పని చేయట్లేదన్నారు.

మృతి చెందినట్టు ధృవీకరించిన వైద్యులు

బ్రెయిన్ ఫంక్షనింగ్ మరియు నాడీ వ్యవస్థ పనితీరుపైన మరో మారు స్టడీ చేసిన తర్వాత ఆయన కండిషన్ చెప్తామని వైద్యులు వెల్లడించారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి బ్రెయిన్ డెడ్ కావడంతో వైద్యులు ఆయన మృతి చెందినట్టుగా వెల్లడించారు.పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పెద్ది రాజిరెడ్డి-అమ్భతమ్మ.

పెద్ది సుదర్శన్ రెడ్డిది హార్ట్ ఎటాక్ కాదు.. ఆ టాబ్లెట్ వల్లే.. ఫైనల్ డెసిషన్ ఫ్యామిలీదే!
పెద్ది సుదర్శన్ రెడ్డిది హార్ట్ ఎటాక్ కాదు.. ఆ టాబ్లెట్ వల్లే.. ఫైనల్ డెసిషన్ ఫ్యామిలీదే!

పెద్ది రాజకీయ ప్రస్తానం ఇలా, ఆయన అంత్యక్రియలు అప్పుడే

నల్లబెల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయాలలోకి అడుగుపెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2001 నుంచి KCRతో అడుగులు వేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. 2014లో MLAగా పోటీ చేసి ఓడిపోయారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన 2018లో MLAగా గెలుపొందాడు. 2023లో దొంతి మాధవరెడ్డి చేతిలో ఓటమి చెందారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల పార్టీ శ్రేణులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+