సెలవు ఇవ్వలేదని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు

హైదరాబాద్: తనను డ్యూటీ నుంచి రిలీవ్ చేయట్లేదని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని అవంతిపురంలో గురువారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే అవంతిపురం పంచాయతీ పరిధిలోని జంగాల కాలనీకి చెందిన శ్రీపాటి మస్తాన్ (35) అనే యువకుడు స్థానికంగా ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా డ్యూటీ చేస్తున్నాడు.

person commit suicide with petrol at miryalaguda, nalgonda district

అయితే తనకు గురువారం సెలవు కావాలని బంక్ యజమానిని అడిగాడు. ఇందుకు తోటి కార్మికులు కూడా సహకరించకపోవడంతో మనస్తాపానికి గురైన మస్తాన్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పింటించుకున్నాడు. ఇది గమనించిని మిగతా సిబ్బంది వెంటనే అతడిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో మస్తాన్ శరీరం 90 శాతం వరకు కాలిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అతడి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కల్తీ పెట్రోల్‌పై వాహనదారుల ఆందోళన

నల్లగొండ పట్టణంలో ఓ పెట్రోల్ బంక్‌లో కల్తీ జరుగుతోందంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. దీంతో సమాచారం అందుకున్న పౌర సరఫరాల శాఖ అధికారులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే, కనగల్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి బుధవారం సాయంత్రం నల్లగొండ దేవరకొండ రోడ్డులోని హెచ్‌పీ బంక్ వద్ద తన బైక్‌లో రూ.500 పెట్రోల్ పోయించుకున్నాడు.

అయితే, కొద్దిదూరం వెళ్లేసరికే తన వాహనం మొరాయించడంతో అనుమానం వచ్చిన ఆయన ట్యాంకు కింద ఉండే పైపు ద్వారా పెట్రోల్‌ను బాటిల్‌లోకి పట్టాడు. పెట్రోల్ పైకి తేలుతుండగాఅడుగున అంతా తెల్లటి పదార్ధం ఉంది. దీనిపై ఆయన మరికొందరితో కలసి బంక్ సిబ్బందిని నిలదీశారు.

అయితే, నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో వాహనదారులు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+