Phone tapping case: రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గరలో వార్‌రూమ్‌; తెరపైకి ఓటుకు నోటు వ్యవహారం!!

ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగుతుంది అనేది తాజాగా వెలుగులోకి వస్తున్న అంశాలను బట్టి ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇప్పటికే అనేకచోట్ల వార్ రూములను ఏర్పాటుచేసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు, తాజాగా రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోని ఒక గెస్ట్ హౌస్ లో వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు.

రేవంత్ ఇంటికి సమీపంలో గెస్ట్ హౌస్
రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు గుర్తించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి సమీపంలో ఒక గెస్ట్ హౌస్ తీసుకొని రేవంత్ తో పాటు ఆయన సన్నిహితుల పై నిఘా పెట్టారు. అంతేకాదు ఈ గెస్ట్ హౌస్ కేంద్రంగా భారీ సెటిల్మెంట్లు కూడా చేసినట్లు సమాచారం.

Phone tapping case war room near Revanth Reddy house vote for money issue on the screen

ఫోన్ ట్యాపింగ్ తోనే ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి
ఇక ఈ విషయాన్ని తాజాగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డి రాధా కిషన్ రావు ను విచారిస్తున్న క్రమంలో అధికారులు గుర్తించారు. దీంతో ఆ గెస్ట్ హౌస్ లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా మరొక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. 2015 లో జరిగిన ఓటుకు నోటు వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది.

రేవంత్ రెడ్డిని పట్టుకోవటం వెనుక ఫోన్ ట్యాపింగ్
ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం వెనుక ఫోన్ ట్యాపింగ్ గ్యాంగ్ వ్యూహం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మాత్రమే కాదు 2022 లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా ఫోన్ ట్యాపింగ్ వల్లనే జరిగినట్టు సమాచారం. అయితే 2018 తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త పుంతలు తొక్కింది.

సూట్ కేసులో ఇమిడిపోయే ట్యాపింగ్ పరికరం
ప్రణీత్ రావు, తిరుపతన్న, వేణుగోపాలరావు తదితరులను ఎస్ఐబి లోకి తీసుకున్న తర్వాత భుజంగరావు పొలిటికల్ ఇంటిలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకరరావు ఫోన్ ట్యాపింగ్ ను మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకు తీసుకువెళ్లారు. విదేశాల నుండి కావలసిన ఉపకరణాలను తెప్పించి సూట్ కేసులో ఇమిడిపోయే విధంగా ట్యాపింగ్ పరికరాన్ని మ్యాన్ ఇన్ ది మిడిల్ ఎటాక్స్ కు ఉపయోగించేవారు.

రేవంత్ రెడ్డి ఫ్యామిలీ, సన్నిహితుల ఫోన్లు ట్యాప్
ప్రణీత్ రావు టీమ్ ఫోన్ ట్యాపింగ్ పరికరాన్ని ఒక వాహనంలో పెట్టుకొని, ఎవరైతే టార్గెట్ నో వారి ఇంటికి సమీపంలో వెళ్లి అక్కడ 300 మీటర్ల పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ ను తెలుసుకునేవారు. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో కూడా రేవంత్ రెడ్డి కుటుంబీకులతో పాటు, ఆయన ప్రధాన అనుచరులు, సన్నిహితులతో జరిగిన ఫోన్ సంభాషణలను తెలుసుకున్నట్టుగా గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+