పోలీసులపై వీరంగం: బాడీ వేర్ కెమెరాకు చిక్కిన యువతి (పిక్చర్స్)
హైదరాబాద్: పోలీసులపై వీరంగం సృష్టించి, వారిని బూతులతో కడిగేసిన ఓ యువతి తప్పించులేకుండా బాడీ వేర్ కెమెరాకు చిక్కిపోయింది. హైదరాబాదులోని హిమాయత్‌నగర్‌లో శుక్రవారంనాడు ఆ సంఘటన జరిగింది. ముఖానికి స్క్వార్ఫ్ ధరించిన యువతి పోలీసులపై విరుచుకుపడిన దృశ్యాలు బాడీ వేర్ కెమెరాకు చిక్కాయి.
గురువారంనాడు ఐశ్వర్య పషీ అనే యువతి స్నేహితురాలితో కలిసి హిమాయత్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రోడ్డులో ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్‌కు వచ్ిచంది. నోపార్కింగ్ ప్రదేశంలో బైక్‌ను పార్క్ చేసి మొదటి అంతస్థులో ఉన్న బ్యాంకులోకి వెళ్లింది.
అదే దారిలో ట్రాఫిక్ వెహికిల్ లిఫ్టింగ్ వాహనంలో నారాయణగుడా ట్రాఫిక్ పిఎస్ ఎస్ఐ రమేష్ బృందం వచ్చింది. బ్యాంకు ముందు నోపార్కింగ్ ప్రదేశంలో ఉన్న బైక్‌లను వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఇందులో ఐశ్వర్య బైక్ కూడా ఉంది. దాంతో ఆమె పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో వాగ్వివాదానికి దిగింది.

పరుష పదజాలంతో..
పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఐశ్వర్యం పరుష పదజాలంతో ఎస్ఐ సహా సిబ్బందిపై విరుచుకుపడింది. ఇవన్నీ ఎస్ఐ రమేష్ మెడలో ఉన్న బాడీ వేర్ కెమెరాలో రికార్డయ్యాయి.

వీడియో ఆధారంగా...
రికార్డు అయిన వీడియో ఆధారంగా నారాయణగుడా పోలీసు స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసులు నమోదు చేశారు.

అరెస్టు చేశారు..
ఐశ్వర్యపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. బాడీ వేర్ కెమెరాలను ఇటీవలే హైదరాబాదు పోలీసులు ప్రవేశపెట్టారు.

బాడీ వేర్ కెమెరాలు..
హైదరాబాదులో అందుబాటులోకి వచ్చిన బాడీ వేర్ కెమెరాల ప్రయోగం సత్ఫలితాలు ఇస్తున్నట్లే కనిపిస్తోంది. ఐశ్వర్య సంఘటనే ఇందుకు తాజా ఉదాహరణ












Click it and Unblock the Notifications