నా మాటగా కేసీఆర్ కు చెప్పండి- ప్రధాని మోదీ..!!
తెలంగాణ రాజకీయాలలో కీలక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిందని..మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నరు. తెలంగాణ లో పార్టీ నేతల పని తీరు పైన ప్రధాని మోదీ ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో కేసీఆర్ గురించి ప్రధాని మోదీ ఆరా తీసారు. ఇప్పుడు ఈ పరిణామం ఆసక్తి కరంగా మారుతోంది.
మాజీ సీఎం కేసీఆర్ గురించి ప్రధాని మోదీ ఆరా తీసారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో ప్రధానితో సన్నిహితంగా ఉండేవారు. 2023 ఎన్నికల మందు కేంద్రం... ప్రధాని మోదీ తీరు పైన కేసీఆర్ విమర్శలు చేసారు. మోదీకి వ్యతిరేకంగా పలువురు పార్టీల నేతలతో భేటీ అయ్యారు. 2023 ఎన్నికల్లో ఓటమి తరువాత జాతీయ రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. కాగా, ఇప్పుడు ప్రధాని మోద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ''కేసీఆర్ ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమనండి. ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పమన్నానని చెప్పండి'' అని తనను కలిసి బీఆర్‌ఎస్ ఎంపీలకు మోదీ చెప్పారు. బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ధీకొండ దామోదర్‌రావు పార్లమెంట్‌లో ప్రధాన మంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు.

ప్రధానిని కలిసిన సమయంలో ఎంపీలు సిరిసిల్ల వరకూ నిర్మిస్తున్న నేషనల్ హైవే 365బిని వేములవాడ మీదుగా కోరుట్ల వరకూ విస్తరించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ అంశాన్ని ఇప్పటికే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని మోదీకి గుర్తు చేశారు. ఈ రహదారిని విస్తరించేందుకు కేంద్ర మంత్రి అధికారికంగా మాట ఇచ్చిన విషయాన్ని వివరించారు. ఈ రహదారిని విస్తరించడం వల్ల ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్థి అవుతుందని తెలిపారు. ధవళేశ్వరం బ్రిడ్జ్ మాదిరిగా మిడ్ మానేరుపై రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి, వేములవాడ మీదుగా కోరుట్లలో ఎన్‌హెచ్-63ని కలిపేలా విస్తరించాలని కోరారు. కరీంనగర్ పట్టణాన్ని సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌తో నేరుగా అనుసంధానించే మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో భాగంగా వంతెన పనుల విషయంలోనూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎంపీలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే తెలంగాణ బీజేపీ ఎంపీలకు క్లాస్ పీకిన నరేంద్ర మోదీ.. ప్రత్యేకంగా కేసీఆర్ గురించి అడగడం, తన మాటగా కేసీఆర్‌కు చెప్పాలని సూచించడం రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications