మోదీ లెక్కే వేరు: మాతో 'కలవండి'.. సీఎం రేవంత్‌కు ఓపెన్ ఆఫర్ వెనుక..!!
తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ద్వారా బీజేపీ ఆపరేషన్ తెలంగాణ మొదలు పెట్టింది. బెంగాల్ లో విజయం తో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో నూ బలం పెంచుకోవాలని డిసైడ్ అయింది. తెలంగాణ పైన గురి పెట్టింది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మోదీ ధీమా వ్యక్తం చేసారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ సీఎం రేవంత్ ను ఉద్దేశించి మాతో కలవండి అంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త టర్న్ తీసుకున్నాయి. రాజకీయ చర్చగా మారాయి. అసలు ఏం జరుగుతుందనే ఆసక్తిని పెంచుతున్నాయి.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ తెలంగాణ లో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. అందులో భాగంగా ప్రధాని సభ సక్సెస్ చేయటం ద్వారా వ్యూహాలు అమలు ప్రారంభించింది. ప్రధాని మోదీ సైతం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేసారు. ఇదే సమయంలో తెలంగాణకు కేంద్రం అందిస్తున్న మద్దతు గురించి మోదీ ప్రత్యేకంగా వివరించారు. కాగా.. ప్రధాని మోదీ హెచ్‌ఐసీసీలో సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి 'నాతో కలవండి' అంటూ చేసిన వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది. అటు సోషల్ మీడియాలో, ఇటు ముఖాముఖి చర్చల్లోనూ దీనిపైనే చర్చ నడిచింది. మోదీ ఆ మాట అన్నారంటే దాని వెనుక ఏదో అర్ధం, ఉద్దేశం అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బీజేపీ సభలోనూ మోదీ ప్రసంగం కంటే కూడా 'నాతో కలవండి' అనే మాటపైనే ఎక్కువగా చర్చ వినిపించింది.

రాజకీయ చర్చగా మారిన ఆఫర్
హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ కీలక అంశాలను ప్రస్తావించారు. రాజకీయాలు మాట్లాడనని చబుతూనే.. గుజరాత్ తో సమానంగా తెలంగాణను నిధులు ఇవ్వాలంటూ కీలక ప్రతిపాదన చేసారు. దీనికి మోదీ సైతం తన స్టైల్ లో స్పందించారు. " సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడ రాజకీయాలు మాట్లాడనని అన్నారు. నేను కూడా మాట్లాడను. కానీ, రేవంత్‌రెడ్డికి చెబుతున్నా. గతంలో కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌కు ఎన్ని నిధులు ఇచ్చిందో.. అన్ని నిధులు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ, అలా చేస్తే.. ప్రస్తుతం మీకు అందుతున్నది కాస్తా సగం అయిపోతుంది. మీరు ఎక్కడికి చేరుకోవాలని అనుకుంటున్నారో.. అక్కడికి చేరుకోలేరు. అందుకే నా తోనే కలవండి (మేరే సేహీ జుడో)'' అంటూ మోదీ చెప్పుకొచ్చారు. దీంతో.. నాతో కలవండి అనటం వెనుక
గుజరాత్‌కు ఆనాడు ప్రత్యేకంగా వచ్చిందేమీ లేదని చెప్పడం కోసమే ఆ మాట అన్నారా? లేక నిజంగానే వేరే ఉద్దేశంతో అన్నారా... అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.













Click it and Unblock the Notifications