కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగిస్తాం - ప్రధాని మోదీ..!!
తెలంగాణ ప్రభుత్వం..పాలన పైన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎక్కడా ముఖ్యమంత్రి కేసీఆర్ - బీఆర్ఎస్ ప్రస్తావన లేకుండానే తాను చెప్పదలచుకున్నది స్పష్టం చేసారు. తెలంగాణలో కుటుంబ పాలనతో అవినీతిని పెంచి పోషిస్తున్నాంటూ ఫైర్ అయ్యారు.
కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కావాలని పేర్కొన్నారు. ప్రతీ ప్రాజెక్టులో స్వార్దం చూసుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రూ 11 ,355 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసారు. తెలంగాణలో ప్రజా వ్యతిరేక మొదలైందని ప్రధాని వ్యాఖ్యానించారు.

అప్రమత్తంగా ఉండాలి: హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎంఎంటీస్ సర్వీసులతో పాటుగా రైలు, రోడ్డు, వైద్య రంగాలకు చెందిన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసారు. ఇదే సభలో కేంద్రం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. తెలంగాణకు ఏ విధంగా సహకరిస్తుందీ చెప్పుకొచ్చారు.
తన ప్రసంగంలో ప్రధానంగా పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. ప్రతీ వ్యవస్థ తమ కంట్రోల్ లో ఉండాలని కుటుంబ పాలన కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రతీ ప్రాజెక్టులో కుటుంబం తమ స్వార్ధం చూసుకుంటోందని ఆరోపించారు. అవినీతి - కుటుంబ పాలన వేర్వేరు కాదని ప్రధాని చెప్పుకొచ్చారు. అవినీతి పరులపైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అవినీతిని పెంచి పోషిస్తున్నారు: సొంత కుటుంబం ఎదిగితే చాలనుకుంటున్నారని పేర్కొన్నారు. కుటుంబ పాలనతో అవినీతిని పెంచి పోషిస్తున్నారని ఫైర్ అయ్యారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కావాలన్నారు. తన పైన పోరాటానికి వ్యతిరేక శక్తులు అన్నీ ఏకమయ్యాయని చెప్పారు. అవినీతి పరులను శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రధాని సభికుల నుంచి సమాధానం రాబట్టారు.
కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం కలిసి రావటం లేదన్నారు. ఫలితంగా రాష్ట్రంలో అభివృద్ధి ఆలస్యం అవుతోందన్నారు. రాష్ట్ర సహకారం లేక తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని ప్రధాని చెప్పుకొచ్చారు. సొంత కుటుంబం ఎదిగితే చాలనుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు.
విముక్తి కలిగిస్తాం: అవినీతి చిట్టా బయటకు వస్తుందనే భయంతోనే విపక్షాలు అన్నీ కోర్టుకు వెళ్లాయన్నారు మోడీ. అవినీతిపరులపై పోరాటానికి తెలంగాణ ప్రజల సహకారం కావాలని మోడీ కోరారు. బీజేపీని అశీర్వదిస్తే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ కొందరి గుప్పిట్లో అధికారం మగ్గుతోందని మండిపడ్డారు.
కుటుంబ పాలనకు విముక్తి కలగాలని చెప్పారు. కుటుంబ పాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగిస్తామని ప్రధాని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కేంద్రం అమలు చేస్తున్న పథకాలు..రహదారుల అనుసంధానం..అభివృద్ధి గురించి ప్రధాని వివరించారు. తొమ్మిదేళ్లల్లో దేశం రూపురేఖలు పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications