మోదీ ఫ్రాన్స్ పర్యటనలో తెలంగాణ గుబాళింపు- గిఫ్ట్‌గా పోచంపల్లి చీరె

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు తీరిక లేని షెడ్యూల్‌లో గడిపారు. ఇవ్వాళ ఆయన బాస్టిల్ డే పరేడ్‌కు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఆ దేశాధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్, ప్రథమ మహిళ బ్రిగెట్టే మాక్రాన్, ప్రధానితో కలిసి యుద్ధ విన్యాసాలను వీక్షించారు. సైనిక వందనాన్ని స్వీకరించారు.

ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యాల్ బ్రౌన్-పివెట్‌ను మర్యాదపూరకంగా కలుసుకున్నారు. ఆమె అధికారిక నివాసం హోటల్ డి లాస్సేలో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య పార్లమెంటరీ సహకారం, వాణిజ్యం, ఆర్థికం, సాంకేతికత, సాంస్కృతికం, పర్యావరణంతో సహా ఇతర ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలను చర్చకు వచ్చాయి.

PM Modi France

ఇరు దేశాల మధ్య ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, భాగస్వామ్య విలువల గురించి ఇద్దరు నేతలు ప్రస్తావించారు. అంతకుముందు ఫ్రాన్స్‌కు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖాముఖిగా భేటీ అయ్యారు ప్రధాని మోదీ. మార్సెయిల్ సిటీలో కొత్తగా కాన్సులేట్‌ను ప్రారంభించబోతోన్నామని తెలిపారు.

ఫ్రాన్స్‌లో చదువుతున్న భారతీయ సంతతికి చెందిన వారికి దీర్ఘకాలిక వీసాలు మంజూరు చేయాలంటూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీన్ని స్వాగతిస్తున్నానని మోదీ చెప్పారు. భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని ఫ్రెంచ్ యూనివర్శిటీలను ఆహ్వానించారు. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి భారత అథ్లెట్లు ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

PM Modi France

అనంతరం మోదీ.. పారిస్‌లో ఏర్పాటైన ఇండియా-ఫ్రాన్స్ సీఈవో ఫోరమ్‌లో పాల్గొన్నారు. ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో కలిసి ఒకే కారులో వచ్చారాయన. భద్రత సలహాదారు అజిత్ దోవల్ సహ రెండు దేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈఓలు, ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు.

తన పర్యటన సందర్భంగా మాక్రాన్‌, ఆయన భార్య, ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగెట్టే మాక్రాన్‌కు ప్రధాని మోదీ పలు బహుమతులను అందజేశారు. శాండల్‌వుడ్ సితార్‌ను కానుకగా ఇచ్చారు. స్వచ్ఛమైన చందనంతో దీన్ని తయారు చేశారు. ఆ దేశ ప్రధాని ఎలిజబెత్ బోర్న్‌కు మార్బుల్ ఇన్లే వర్క్‌ టేబుల్‌ను అందజేశారు.

PM modi

పాలరాతి పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని మక్రానా టౌన్‌లో దీన్ని తయారు చేశారు. దీనిపై పొదిగిన విలువైన రంగు రాళ్లను రాజస్థాన్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి సేకరించారు. ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యాయిల్ బ్రౌన్-పివెట్‌కు చేతితో అల్లిన సిల్క్ కాశ్మీరీ కార్పెట్‌ను బహుమతిగా ఇచ్చారు. చేతితో అల్లిన పట్టు తివాచీ ఇది.

బ్రిగెట్టే మాక్రాన్‌కు ప్రఖ్యాతి చెందిన పోచంపల్లి జరీ సిల్క్ ఇకత్ చీరెను గిఫ్ట్‌గా ఇచ్చారు ప్రధాని మోదీ. దీనికోసం ప్రత్యేకంగా ఓ శాండల్‌వుడ్ బాక్స్‌ను తయారు చేయించారు. పోచంపల్లి సిల్క్ ఇకత్ చీరె దక్షిణ భారత సంస్కృతి సంప్రదాయాలు, చేనేత- హస్తకళలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు ప్రధాని మోదీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+