సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ప్రారంభం : ప్రధాని మోదీ పచ్చ జెండా..!!
తెలుగు రాష్ట్రాల్లో రెండో వందేభారత్ పట్టాలెక్కింది. ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ను ప్రారంభించారు. మూడు నెలల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండో వందే భారత్. ఐటీ సిటీ టు టెంపుల్ సిటీకి వందేభారత్ అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసారు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా 13 కొత్త సర్వీసులను ప్రారంభించారు.
ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చారు. అక్కడ ముందుగా నిర్ణయించిన విధంగా సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ను ప్రధాని ప్రారంభించారు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి నాడు తెలుగు రాష్ట్రాల్లో తొలి వందేభారత్ ను ప్రధాని మోదీ వర్చ్యువల్ గా ప్రారంభించారు.
సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తున్న ఆ వందేభారత్ కు భారీ స్పదన వచ్చింది. ఇప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు ప్రారంభించిన వందేభారత్ ద్వారా 8.30 గంటల్లోనే చేరుకొనే అవకాశం ఉంటుంది. మంగళవారం మినహా వారంలో మిగిలన రోజుల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే షెడ్యూల్, టికెట్ ధరలు ప్రకటించారు.

ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు భూమి పూజ చేసారు. రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు రూ.715 కోట్ల వ్యయం చేయాలని నిర్ణయించారు. రూ.1,410 కోట్లతో పూర్తి చేసిన సికింద్రాబాద్, మహబూబ్ నగర్ డబ్లింగ్ లైన్ ను జాతికి అంకితం చేసారు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా 13 కొత్త సర్వీసులను ప్రారంభించారు.
#WATCH | PM Narendra Modi inspects Secunderabad-Tirupati Vande Bharat Express and interacts with school children.
— ANI (@ANI) April 8, 2023
(Source: DD News) pic.twitter.com/QHD62jight
ప్రధాని భూమిపూజ చేసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయితే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రపంచస్థాయి ప్రమాణాలతో కొత్తరూపు రూపుదిద్దుకోనుంది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఉండే సకల సదుపాయాలను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే భూసార పరీక్షలు పూర్తి చేశారు. టికెట్ బుకింగ్ కేంద్రాలు, రైల్వే రక్షణ దళం కార్యాలయాలను తరలించేందుకు ప్రత్యామ్నాయ భవనాల నిర్మాణం సైతం చేపట్టారు. మోడీ శంకుస్థాపన తర్వాత నిర్మాణ పనులు స్పీడు అందుకోనున్నాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.
#WATCH | Telangana | PM Narendra Modi flags off Vande Bharat Express between Secunderabad and Tirupati.
— ANI (@ANI) April 8, 2023
It will reduce the travel time between the two cities by almost three and a half hours. pic.twitter.com/UCMd6yuWqC
సికంద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభకు హాజరు కానున్నారు. అక్కడ రూ 11వేల కోట్లకు పైగా రాష్ట్రంలోని పలు కార్యక్రమాలను శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత ప్రధాని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications