వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ రామగుండం పర్యటన రచ్చ: టీఆర్ఎస్ కు షాకిచ్చే పక్కా వ్యూహంతో బీజేపీ!!

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు కారణమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 12వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. నవంబర్ 12వ తేదీన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేయడానికి ప్రధాన నరేంద్ర మోడీ రామగుండం కి రానున్నారు. టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుంటే, బిజెపి ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ప్రయత్నాలు చేస్తుంది.

ప్రధాని మోడీ రామగుండం పర్యటన రగడ: వస్తే రణరంగమే.. అడ్డుకునేందుకు పక్కా వ్యూహంతో టీఆర్ఎస్!!ప్రధాని మోడీ రామగుండం పర్యటన రగడ: వస్తే రణరంగమే.. అడ్డుకునేందుకు పక్కా వ్యూహంతో టీఆర్ఎస్!!

 రామగుండంలో మోడీ సభ.. సక్సెస్ చెయ్యాలని బీజేపీ

రామగుండంలో మోడీ సభ.. సక్సెస్ చెయ్యాలని బీజేపీ


కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దక్షిణాది ప్రాంతంలో అతిపెద్ద ఎరువుల కర్మాగారం అయినా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్రధాని నరేంద్ర మోడీఎన్టీపీసీస్టేడియంలో జరిగే కార్యక్రమంలో జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం బీజేపీ పక్కా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

రేపటి నుండి బీజేపీ సన్నాహాలు ఇలా

రేపటి నుండి బీజేపీ సన్నాహాలు ఇలా


10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో రైతులతో రైతే రాజు అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. రైతులతో కిలోమీటర్ మేర ర్యాలీ నిర్వహించాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అతిపెద్ద ఎరువుల కర్మాగారం రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని , దానిని జాతికి అంకితం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని రైతులకు తెలియజేసే ప్రయత్నం లో భాగంగా ఈ కార్యక్రమాలను నిర్వహించనుంది. అంతేకాదు ప్రధాని రామగుండం పర్యటనపై రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనేక పనులపై ప్రజలకు తెలియజేసేలా 11వ తేదీన విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చూసేలా పెద్ద స్క్రీన్లతో మోడీ కార్యక్రమం

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చూసేలా పెద్ద స్క్రీన్లతో మోడీ కార్యక్రమం


ఇక ప్రధాని నరేంద్రమోడీ రామగుండం వచ్చి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ జాతికి అంకితం చేసే కార్యక్రమం నిర్వహించే రోజు ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ లో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేసి, 1000 మంది రైతులతో ప్రధాని మోడీ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ఏర్పాటు చేయనున్నారు. 74 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఫంక్షన్ హాల్ లలోబిగ్ స్క్రీన్స్ఏర్పాటు చేసి మోడీ పర్యటన ఆద్యంతంచూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు బిజెపి నాయకులు.

మోడీ సభకు 50 వేల మంది రైతులను తరలించాలని ప్లాన్

మోడీ సభకు 50 వేల మంది రైతులను తరలించాలని ప్లాన్


అంతేకాదు బిజెపి పెద్దపల్లి జిల్లా రామగుండం లో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ సభకు 50వేల మందిని తరలించాలని నిర్ణయించింది.ముందుగా లక్ష మందిని ప్రధాని పర్యటన నేపథ్యంలో తరలించాలని భావించినా,స్థలాభావం కారణంగా 50 వేల మందిని తరలించాలని భావిస్తోంది. పెద్దపల్లి జిల్లా తో పాటు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుండిపెద్ద సంఖ్యలో రైతులనుమోడీసభకు తరలించేలా ప్లాన్ చేస్తున్నారు.మోడీ సభను సక్సెస్ చేయాలని బిజెపి,సభను అడ్డుకోవాలని టిఆర్ఎస్ పార్టీ వామపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్న వేళ ప్రధాని మోడీతెలంగాణ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.

English summary
PM Modi will come to Ramagundam to dedicate Ramagundam Fertilizers and Chemicals Limited to the nation on 12th November.TRS party is trying to block the program, the BJP is planning to make this program a success.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X