ట్రైలర్ చూసారు, ఇక సినిమా చూస్తారు - ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!!
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల కోసం పని చేయలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. తూప్రాన్ లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ వచ్చినా బీసీలకు అవకాశం రాలేదని..బీసీ సీఎం బీజేపీతోనే సాధ్యమని ప్రధాని స్పష్టం చేసారు. ఢిల్లీలో మరో పార్టీతో కలిసి లిక్కర్ స్కాం చేసారని..ఎవరినీ వదిలేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారని విమర్శించారు.
కేసీఆర్ పై మోదీ ఫైర్ : ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ గురించి తెలుగులో మాట్లాడారు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి అవసరమా..ఫాం హౌస్ లో పడుకొనే ముఖ్యమంత్రి మనకు అవసరమా..సచివాలయానికి రాని ముఖ్యమంత్రి అవసరమా అంటూ తెలుగులో ప్రశ్నించారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని ప్రధాని చెప్పుకొచ్చారు. చేతకాని, అసమర్థ నాయకులు దేశాన్ని పాలిస్తే ఇలానే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. గజ్వేల్‌లో ఈటల రాజేందర్ పోటీ చేస్తే ఓటమి భయంతో కేసీఆర్ వేరే చోటికి వెళ్లారన్నారు. గతంలో రాహుల్ గాంధీ కూడా ఇలానే పోటీ చేశారని గుర్తు చేసారు.

బీసీలకు గుర్తింపు : తెలంగాణలో బీజేపీ గాలి స్పష్టంగా కనిపిస్తుందని ప్రధాని చెప్పుకొచ్చారు. తెలంగాణలో తొలి సారి బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. బీసీ వర్గానికి సీఎం పదవి కేటాయిస్తామని వెల్లడించారు. మోదీ గ్యారంటీ ఇస్తే గ్యారంటీగా చేసే నిర్ణయమని చెప్పుకొచ్చారు. కేసీఆర్, కాంగ్రెస్ ఒక్కటేనని..ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దుబ్బాక, హుజూరాబాద్ లో ట్రైలర్ చూసారని, ఇక పై సినిమా చూస్తారని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ తెలంగాణ ప్రతిష్ఠ పెంచుతుందని వివరించారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. బీసీలకు బీజేపీతోనే ప్రయోజనాలకు చేకూరుతాయని ప్రధాని చెప్పుకొచ్చారు.
ఆ రెండు పార్టీలు ఒక్కటే : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కుటుంబం కోసమే పని చేసిన కేసీఆర్..ప్రజల ఆదాయం పెంచుతామని చెప్పి..తన కుటుంబ ఆదాయాన్ని పెంచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైతే ఉద్యోగాలిస్తామని చెప్పిన కేసీఆర్..నిరుద్యోగులను మోసం చేసారని విమర్శించారు. రైతులకు నీళ్లిస్తామని చెప్పి మరిచిపోయారన్నారు. అనేక స్కీముల పేర్లు చెప్పి స్కాములకు పాల్పడిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని ప్రధాని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వారసత్వ రాజకీయాల కారణంగా వ్యవస్థలు నాశనం అయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ సుల్తాన్ లను పెంచి పోషిస్తే...బీఆర్ఎస్ నిజాంలను పోషించిందని మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవిష్యత్ కోసం తాను హామీ ఇస్తున్నానని..బీజేపీకి మద్దతుగా నిలవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
-
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications