Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేరుగా రంగంలోకి ప్రధాని - తెలంగాణలో కొత్త స్కెచ్..!

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్ఎస్(BRS) మూడో సారి అధికారమే లక్ష్యంగా పని చేస్తోంది. కాంగ్రెస్ గ్యారంటీ ప్రకటనలతో అధికారం చేజిక్కుంచుకనే ప్రయత్నం ప్రారంభించింది. ఈ సమయంలో బీజేపీ(BJP) రంగంలోకి దిగుతోంది. నేరుగా ప్రధాని(PM Modi) వరుసగా మూడు రోజుల సమయంలో రెండు జిల్లల్లో బహిరంగ సభల్లో పాల్గొనునున్నారు. ఇదే సమయంలో అభ్యర్దులను ఖరారు విషయంలోనూ కొత్త స్కెచ్ అమలుకు సిద్దమైంది.

రెండు జిల్లాల్లో ప్రధాని సభలు
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణ(Telangana)లో దూకుడు మీద కనిపించిన బీజేపీ(BJP) కొంత కాలంగా వెనుకబడింది. బీఆర్ఎస్.. కాంగ్రెస్ తో పోటీగా ఇప్పుడు బీజేపీ కొత్త కార్యాచరణ సిద్దం చేస్తోంది. బీజేపీ అధి నాయకత్వం తెలంగాణలో మొహరిస్తోంది. ప్రధాని మోదీ(PM Modi) బహిరంగ సభలకు ముహూర్తం ఖరారైంది. ప్రధాని(PM Modi) అక్టోబర్ 1,3 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారు. అక్టోబర్‌ 1న మధ్యాహ్నం 1:30 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు మోదీ. విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో 1.45 గంటల నుంచి 2.15 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 3.15 నిమిషాల నుంచి 4.15 వరకు మహబూబ్‌నగర్‌(Mahabbobnagar) జిల్లా భూత్పూర్‌లో బీజేపీ నిర్వహించే సమరభేరి బహిరంగ సభలో పాల్గొంటారు.

PM Modi

అసెంబ్లీ బరిలో ఎంపీలు
అక్టోబర్‌ 3 నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు మోదీ. నిజామాబాద్‌(Nizamabad)లో రోడ్ షో, ఆ తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు ప్రధాని. నిజామాబాద్‌ సభ నుంచి తెలంగాణ రాజకీయాలకు మోదీ దిశానిర్ధేశం చేయనున్నారు. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహాత్మకంగా కేంద్ర మంత్రులు, ఎంపీలను అసెంబ్లీ(Assembly) ఎన్నికల బరిలోకి దింపుతోంది. తెలంగాణలోనూ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(kishan Reddy)..ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దించాలని నిర్ణయించారు. బండి సంజయ్(Bandi Sanjay), ధర్మపురి అర్వింద్, బాపూరావు తో పాటుగా బీజేపీలో జాతీయస్థాయిలో ఉన్న మురళీధర్ రావు, డీకే అరుణ, వెదిరె శ్రీరాం తదితరులను అసెంబ్లీ బరిలో దింపే అవకాశం ఉంది. తద్వారా ఈ నేతలు తమ సీటుతో పాటు చుట్టుపక్కల స్థానాలను కూడా ప్రభావితం చేసి గెలిపిస్తారని పార్టీ భావిస్తోంది.

ముఖ్య నేతల సభలు
అక్టోబర్ 5న బీజేపీ(BJP) విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశానికి రాష్ట్ర పదాధికారులు, జిల్లా ఇంచార్జ్‌లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అసెంబ్లీ పాయింట్ ఇన్‌చార్జిలు, కన్వీనర్లు హాజరుకానున్నారు. ఇప్పటికే వీరందరికి ఆహ్వానం వెళ్లింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల సమాయత్తంపై టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ప్రకాశ్ జవదేకర్, తరుణ్‌చుగ్, సమక్షంలో సుదీర్ఘ చర్చ జరగనుంది. అక్టోబర్ ప్రధమార్ధంలోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో, దసరా తరువాతకేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amith Shah), బీజేపీ నేషనల్ చీఫ్ నడ్డా (JP Nadda)తోనూ వరుసగా సభలు నిర్వహించేందుకు తెలంగాణ బీజేపీ కార్యాచరణ సిద్దం చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+