లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోడీ: ఎప్పుడంటే?

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయాన్ని జనవరి 16న తేదీన ప్రధాని మోడీ సందర్శించనున్నారని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనకు సంబంధించి ఆదివారం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ లేపాక్షి ఆలయ ప్రాంగణంలో జిల్లాస్థాయి ఏఎస్ఎల్ సమావేశం నిర్వహించారు.

లేపాక్షి ఆలయాన్ని ప్రధానమంత్రి సందర్శించనున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోవైపు, గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నారోటిక్స్(నాసిన్) ప్రారంభోత్సవానికి జనవరి 16న ప్రధాని మోడీ హాజరయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటి వరకూ అధికారిక సమాచారం లేనప్పటికీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

PM Modi to visit Lepakshi temple in andhra pradesh on January 16th.

శుక్రవారం కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ నాసిన్‌లో పర్యటించారు. సంస్థ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, వీఐపీ గ్యాలరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అసంపూర్తిగా ఉన్న పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో నాసిన్ సంస్థ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+