వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ తెలంగాణా పర్యటన: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం.. షెడ్యూల్ ఇదే!!

|
Google Oneindia TeluguNews

దేశ ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 12వ తేదీన శనివారం నాడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి రెండు రోజుల పర్యటన నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రధాని నరేంద్ర మోడీ, రేపు తెలంగాణ రాష్ట్రం లోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారయింది.

ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇలా

ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇలా

ప్రధాని నరేంద్ర మోడీ రేపు మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ నుండి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1.30 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. 1.35 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి 1.40 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయంలో మోడీ రాక నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొంటారు. దాదాపు 20 నిమిషాల పాటు స్వాగత సమావేశంలో పాల్గొని, ఆపై రోడ్డు మార్గంలో తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేది అప్పుడే

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేది అప్పుడే


బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు MI-17 హెలికాప్టర్ ద్వారా రామగుండం కి బయలుదేరి వెళ్తారు. 3 గంటల 20 నిమిషాలకు రామగుండం హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 3 గంటల 25 నిమిషాలకు రామగుండం హెలిప్యాడ్ వద్ద నుండి రోడ్డు మార్గం ద్వారా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ ఫ్యాక్టరీ ప్లాంట్ వద్దకు చేరుకుంటారు. 3 గంటల 30 నిమిషాల నుండి అరగంట పాటు ఆర్ ఎఫ్ సి ఎల్ లో పర్యటిస్తారు. 3 గంటల 30 నిమిషాలకు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు.

రామగుండంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రధాని మోడీ

రామగుండంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రధాని మోడీ

పరిశ్రమను సందర్శించిన తర్వాత 4 గంటల 5 నిమిషాలకు పరిశ్రమ నుంచి బయలుదేరి, 4 గంటల 15 నిమిషాలకు సభాస్థలికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుండి, 5 గంటల 15 నిమిషాల వరకు రామగుండంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా 1000 కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్డు సత్తుపల్లి రైల్వే లైన్ లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. 2,200 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 3 నేషనల్ హైవే ప్రాజెక్టులకుకూడా మోడీరామగుండం వేదికగా శంకుస్థాపన చేస్తారు.

ప్రధాని పర్యటన నేపధ్యంలో బీజేపీలో జోష్

ప్రధాని పర్యటన నేపధ్యంలో బీజేపీలో జోష్


అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ 5 గంటల 20 నిమిషాలకు అక్కడినుండి రోడ్డు మార్గం ద్వారా రామగుండం హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఆపై MI-17 హెలికాఫ్టర్లో బయలుదేరి 6 గంటల 35 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. 6 గంటల 40 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఇక ప్రధాని పర్యటన నేపధ్యంలో బీజేపీ మంచి జోష్ లో ఉంది. ప్రధాని పర్యటన సక్సెస్ చెయ్యాలని భావిస్తుంది.

చేసిన తప్పులవల్లే మోడీ ముందుకు కేసీఆర్ రావట్లేదు; వామపక్ష నాయకులకు ఈటల రాజేందర్ చురకలు!!చేసిన తప్పులవల్లే మోడీ ముందుకు కేసీఆర్ రావట్లేదు; వామపక్ష నాయకులకు ఈటల రాజేందర్ చురకలు!!

English summary
Prime Minister Narendra Modi will come to Ramagundam to dedicate Ramagundam Fertilizers and Chemicals Limited to the nation on 12th November. This is the schedule of PM Modi visit to telangana,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X