ప్రధాని మోడీ పర్యటన: నో ప్లై జోన్స్ గా వరంగల్, హనుమకొండ; అక్కడ 144సెక్షన్!!
భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా వరంగల్ జిల్లాకు రానుండడంతో జిల్లాలో ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధాని మోడీ పర్యటించే ప్రాంతాలను పరిశీలించింది.
మోడీ పర్యటనా ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని ఎస్పీజీ భారీ భద్రతను ఏర్పాటు చేస్తుంటే, మరోవైపు వరంగల్ కమిషనరేట్ పోలీసులు కూడా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి, శాంతి భద్రతల పరిరక్షణకు భారీ భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.

ఇందులో భాగంగా ప్రధాన మంత్రి పర్యటించే ప్రాంతాల్లో గగనతలాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటిస్తూ వరంగల్ కమిషనర్ ఏ.వి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను అనుసరించి ప్రధానమంత్రి భద్రత దృష్ట్యా ఆరవ తేదీ నుండి 8వ తేదీ వరకు వరంగల్, హనుమకొండ నగరానికి 20 కిలోమీటర్ల వ్యాసార్థంలో నో ఫ్లై జోన్ ప్రకటించడం జరిగింది.
కాబట్టి అక్కడ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ తో పనిచేసే మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ లు, పారా గ్లైడర్ లాంటివి ఎగర వేయడం పూర్తిగా నిషేధించబడ్డాయి. ఎవరైనా వ్యక్తులు, సంస్థలు ఉత్తర్వులను అతిక్రమించి నట్లయితే వారి పైన చట్టపరమైన కఠిన చర్యలు కూడా తీసుకుంటారని పోలీస్ కమిషనర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ట్రై సిటీస్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ ఉత్తర్వులను అనుసరించి ఎవరు ఎటువంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. ఎక్కడా గుంపుగా జనాలు ఉండకూడదు.

మైక్ లు, స్పీకర్లు ఏర్పాటు చేయడంపై కూడా నిషేధం అమలు చేయబడుతుంది. నిషేధం నేడు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదో తారీకు సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని వరంగల్ సీపీ తెలిపారు. ఈ ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి ఏ.వి రంగనాథ్ తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications