భార్యను వేధించిన తెలుగు ఎన్ఆర్ఐ: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఒకరి అరెస్టు
వరకట్న కేసు నమోదైన స్విట్జర్లాండ్ వాసి ఆదిత్యను ముంబై ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అరెస్టు శుక్రవారం నాడు అరెస్టు చేశారు.
హైదరాబాద్:వరకట్న కేసు నమోదైన స్విట్జర్లాండ్ వాసి ఆదిత్య కేసులో ముంబై ఎయిర్ పోర్ట్ లో పోలీసులు ఒకరిని శుక్రవారం నాడు అరెస్టు చేశారు.
హైద్రాబాద్ కు చెందిన కీర్తితో 2014లో స్విట్జర్లాండ్ కు చెందిన ఆదిత్యతో వివాహమైంది. ఈ వివాహం సందర్భంగా పెద్ద ఎత్తున కట్నం ఇచ్చారు.అయినా ఆదిత్య వరకట్నం ఇవ్వాలని డిమాండ్ చేశారని కీర్తి కుటుంబసభ్యులు ఆరోపించారు.

అయితే స్విట్జర్లాండ్ లో కీర్తిని తీవ్రంగా వేధించేవాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆదిత్యపై 2016 లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది.
అయితే ఈ కేసు నమోదైన నేపథ్యంలో పోలీసుల సహయంతో స్విట్జర్లాండ్ నుండి కీర్తి సురక్షితంగా స్వదేశానికి చేరుకొంది.అయితే పోలీసులు ముంబై ఎయిర్ పోర్ట్ లో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications