ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం రోజున అనుమతి లేకుండా భారీగా భక్తులతో శోభాయాత్ర నిర్వహించారని సుమోటోగా కేసు నమోదు చేశారు పోలీసులు. ర్యాలీగా వస్తున్న సమయంలో గౌలిగూడ వద్ద ర్యాలీని నిలిపి బాణాసంచా కాల్చారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేగాక, ర్యాలీని నిలిపివేసి భారీ సభను ఉద్దేశించి రాజా సింగ్ ప్రసంగించారని, దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని పోలీసులు వెల్లడించారు. రాజా సింగ్ పై సెక్షన్ 341, 188, 280, 171-సీ రెడ్ విత్ 34 పీసీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజా సింగ్ తోపాటు జోగేందర్ సింగ్, బిట్టులపై కేసు నమోదు చేశారు పోలీసులు.

శోభయాత్రలో దొంగల చేతివాటం
శ్రీరామనవమి సందర్భంగా రాజా సింగ్ నిర్వహించిన శోభయాత్రలో భక్తుల ముసుగులో వచ్చిన దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించారు. దీంతో మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్‌కు పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. 18 సెల్ ఫోన్లు, 9 మంది బంగారం పోయిందంటూ బాధితులు ఫిర్యాదు చేశారు.
శోభయాత్రలో చొరబడి భక్తులతో కలిసి గొలుసులు, సెల్ ఫోన్లు కొట్టేశారు. అంతేగాక, సివిల్ డ్రెస్ లో ఉన్న ఓ పోలీసు మెడలో ఉన్న చైన్ ను కొట్టేసేందుకు ప్రయత్నించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. చోరీలకు పాల్పడింది మంగుర్ బస్తి యువకులుగా అనుమానిస్తున్నారు. 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సున్న చైన్ స్నాచర్స్ ఈ చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications