మద్యం మత్తులో ఘోరంగా కొట్టుకున్న పోలీసులు.. వైరల్ వీడియో

శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులే మద్యం మత్తులో నగర వాసులను బెంబేలెత్తించారు. మద్యం మత్తులో న్యూసెన్స్ క్రియేట్ చేయడంతోపాటు పోలీసులే ఒకర్నొకరు ఘోరంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా ఉర్సుగుట్టలో జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో సంబంధిత పోలీస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసే ఇలా మద్యం సేవించి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏం జరిగిందంటే..? వరంగల్ జిల్లా ఉర్సుగుట్టలోని బార్‌ లో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ ఫుల్ గా మద్యం సేవించాడు. మద్యం మత్తులో బార్ వద్ద షర్ట్ విప్పి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. వచ్చిపోయేవారిని బెదిరిస్తూ కొద్దిసేపు హల్ చల్ చేశాడు. అయితే ఇది గమనించిన బార్ సిబ్బంది బెటాలియన్ కానిస్టేబుల్‌ పై 112 కు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు.

బెటాలియన్ కానిస్టేబుల్‌ ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. అయితే అందుకు ఆయన అంగీకరించలేదు. షర్ట్ వేసుకుని మర్యాదగా ప్రవర్తించాలని చెప్పాడు. అందుకు బెటాలియన్ కానిస్టేబుల్ ససేమిరా అనడంతో అతని చెంపపై కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి కొట్టాడు. దీంతో ఆగ్రహించిన బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి సంతోష్ రెడ్డి చెంప చెళ్లుమనిపించాడు.

దాంతో అసలు వివాదం మొదలైంది. ఇరువురు కొట్లాడకు దిగారు. మద్యం మత్తులో ఉన్న బీట్ కానిస్టేబుల్ ను కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి లాఠీతో చితకబాదాడు. ఆయనకు తోడు స్థానికులు కూడా బెటాలియన్ కానిస్టేబుల్ ను చితకబాదారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పోలీసులు ఇలా ప్రవర్తించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

police clash warangal Police engage in a violent brawl while intoxicated Warangal video goes viral

మరో ఘటనలో పోలీసులు డిజిటల్ దందాలకు తెర లేపినట్లు పలు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పటాన్‌ చెరులో పోలీసులు డిజిటల్ లంచాల దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ పోలీసులు వసూల్లకు కొత్త రూట్ ను స్టార్ట్ చేసినట్లు స్పష్టం అవుతోంది. పండ్ల బండ్లు, పాన్‌ డబ్బాలు, పెట్రోల్ బంకుల QR కోడ్‌ లకు డబ్బులు పంపిస్తున్నామంటూ వాహనదారులు వాపోతున్నారు. ఈ వసూళ్ల వ్యవహారం చాలాకాలంగా కొనసాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనలపై ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+