అల్లు అర్జున్ మెడకు మరో కేసు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది.ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) ఈ ఫిర్యాదును దాఖలు చేసింది.అల్లు అర్జున్‌తో పాటు,హీరోయిన్ శ్రీలీలపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో AISF పేర్కొన్న వివరాల ప్రకారం, అల్లు అర్జున్, శ్రీలీల పలు కార్పొరేట్ విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. వారు ఆయా కళాశాలల యొక్క విద్యా ప్రమాణాలను సరిగ్గా తెలుసుకోకుండా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని AISF ఆరోపించింది. దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు , వారి తల్లిదండ్రులు నష్టపోతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కార్పొరేట్ కళాశాలల నుండి భారీ పారితోషికం తీసుకుంటూ, విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్న అల్లు అర్జున్ , శ్రీలీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని AISF పోలీసులను కోరింది. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తప్పుడు ప్రకటనలపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది.ఈ ఫిర్యాదు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ , శ్రీలీల దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే, సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించేటప్పుడు మరింత బాధ్యతగా ఉండాలని ఈ ఘటన గుర్తు చేస్తోంది. వారు ప్రోత్సహించే ఉత్పత్తులు, వాటి సంస్థలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అల్లు అర్జున్ ప్రస్తుతం బెయిల్ మీద బయటున్నారనే విషయం తెలిసిందే. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా, ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్ ఒకరోజు జైలులో కూడా ఉండాల్సి వచ్చింది. ఈ కేసులో అల్లు అర్జున్ బెయిల్ మీద ఉన్నారు.












Click it and Unblock the Notifications