పోలీస్ పరేడ్‌లో విషాదం: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
హైదరాబద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని గోషామహల్ స్టేడియంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పరేడ్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుధాకర్ అకస్మాత్తుగా గుండె పోటు వచ్చింది. దాంతో అతడు కుప్పకూలిపోయాడు. సహచరులు అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
మృతుడు సుధాకర్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. సుధాకర్ స్వస్థలం గుంటూరు జిల్లా. ఆయన 1998 పోలీసు శాఖలో చేరారు. విధుల్లో ఎల్లప్పుడు చురుగ్గా వ్యవహారించే సుధాకర్ ఆకస్మిక మరణించడంతో సహచరులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గతంలో ప్రభుత్వం నుంచి సుధాకర్ పలు పతకాలు అందుకున్నారు.

పెళ్లింట విషాదం, ఇద్దరు మృతి
ఖమ్మం జిల్లా వైరా మండలం పినపాక వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో 35మందికి గాయాలయ్యాయి. స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- వైరాలోని బ్రాహ్మణపల్లికి చెందిన ఆది శ్రీకాంత్‌కు తల్లాడ మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మీపార్వతితో శుక్రవారం రాత్రి 11.30గంటలకు వివాహం జరగాల్సి ఉంది. దీంతో మంగాపురం నుంచి ట్రాక్టర్‌లో పెళ్లి కుమార్తె బంధువులు, గ్రామస్తులు బయల్దేరారు. వైరా మండలం పినపాక హైలెవల్ వంతెన వద్దకు రాగానే ట్రాక్టర్ ట్రక్కును వైరా నుంచి తల్లాడ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది.
ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న పెళ్లి బృందం బ్రిడ్జి కింద లోయలో పడిపోయింది. ఈ ఘటనలో వధువు మేనత్త గాదె లీలావతి(40), గాదె రమాదేవి(35) మృతిచెందారు. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న పద్మ, టి.రమాదేవి, వి.లక్ష్మీనరసమ్మ, కె.సుబ్బారావు, పి.అప్పారావు, వెంకమ్మ, పరుచూరి పద్మ, పరుచూరి సామ్రాజ్యం సహా 35మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
ట్రాక్టర్ వెనుక ద్విచక్రవాహనంపై అదే పెళ్లికి హాజరయ్యేం దుకు వస్తున్న వి.రాంబాబు(35) ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications