ఖా'కీచకం'.. తల్లితో సహజీవనం; బిడ్డపై అత్యాచారం; పోక్సో కేసు నమోదు!!
ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ఖాకీలు ఆ పనిని మరిచిపోయి అమానవీయంగా ప్రవర్తించిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. బాలికలకు రక్షణ కల్పించాల్సిన ఒక పోలీసు, ఓ బాలికను చెరబట్టడం, ఆమెపై అత్యాచారానికి పాల్పడడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది. దీంతో అతనిపై అత్యాచారం తో పాటు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం భూపాలపల్లి వి ఆర్ సి ఐ గా పనిచేస్తున్న బండారి సంపత్ 2022లో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేశారు. హనుమకొండలోని ఒక కాలనీలో ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆయన అనంతరం ఖమ్మం జిల్లాకు బదిలీ అయినప్పటికీ సదరు మహిళతో తన సంబంధాన్ని కొనసాగించారు.

ఆపై విఆర్ సీఐగా భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. సంపత్ ను నమ్మిన సదరు మహిళ భర్తను వదిలిపెట్టి సంపత్ తో సహజీవనం సాగిస్తోంది. ఆమెకు ఒక కూతురు ఉంది. ప్రస్తుతం ఆ బాలిక ఇంటర్మీడియట్ చదువుతుంది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఖాకీ అక్కడితో ఆగకుండా ఆమె కూతురు పైన కూడా కన్నేశారు.
గత కొద్ది రోజులుగా సదరు మహిళ 16 సంవత్సరాల కూతురు పైన కామ వాంఛ పెంచుకున్న సదరు పోలీసు వావి వరసలు మరిచి పదహారేళ్ల మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయం తల్లికి చెప్పడంతో ఆమె కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు, ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలిని విచారించి, సంపత్ అత్యాచారానికి పాల్పడ్డాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత సీఐ సంపత్ పైన కేసు నమోదు చేశారు. ఆయన పైన అత్యాచారం తో పాటు ఫోక్స్ చట్టాల కింద కేసు నమోదు చేశారు. గతంలో కూడా సంపత్ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications