'గజల్ శ్రీనివాస్‌ను కావాలనే ఇరికించారు, వీడియోలు మార్ఫింగ్, అమ్మాయిపై అనుమానం!'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను కావాలనే ఈ కేసులో ఇరికించారని, వీడియోలు మార్ఫింగ్ చేశారని, ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలా చేశారని ఆయన సన్నిహితులు, బంధువులు, మిత్రులు ఆరోపిస్తున్నారు.

గజల్ శ్రీనివాస్ దుర్మార్గం ఇదీ, అందుకే: అన్నింటికీ బాధితురాలి సమాధానం

  గజల్ శ్రీనివాస్‌పై వేటు: వెనకేసుకొచ్చిన ఏపీ మంత్రి, 20 వీడియోలు

  గజల్ శ్రీనివాస్ వద్ద పని చేసిన అమ్మాయిపై అనుమానం ఉందని చెబుతున్నారు. ఆమె వెనుక ఎవరో ఉన్నారని అంటున్నారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వారు మాట్లాడారు. అతను అలాంటి వ్యక్తి కాదని, అతను తమకు దశాబ్దాలుగా తెలుసునని చెబుతున్నారు.

  గజల్ శ్రీనివాస్‌కు మరో షాక్, వేటు: 'రాత్రి 10 తర్వాత గదిలోకి, కోరికలు తీర్చమని వేధింపు, గడియ పెట్టి'

   కుట్రగానే భావిస్తున్నాం

  కుట్రగానే భావిస్తున్నాం

  గజల్ శ్రీనివాస్ సన్నిహితులు ఒకరు మాట్లాడుతూ.. ఇది ఊహించని పరిణామం అన్నారు. ఇది కుట్రగానే తాము భావిస్తున్నామని చెప్పారు. ఈ రోజుకు ఆయన బిహేవియర్‌లో మార్పును తాము చూడలేదన్నారు. మహిళల పట్ల ఆయన గౌరవంతో ఉంటారని చెప్పారు. ఆయన ఎదుగుదలను చూడలేక కొందరు ఈ కుట్ర చేసి ఉంటారన్నారు. ఆయన చిన్నస్థాయి నుంచి కష్టపడి తన మేథో సంపత్తితో ఎదిగాడన్నారు.

   ఆ వీడియోలపై కోర్టులో తేలుతుంది

  ఆ వీడియోలపై కోర్టులో తేలుతుంది

  గజల్ శ్రీనివాస్ చాలా మంచివాడని, ఆడవారిని సొంత ఆడపడుచుల్లా చూస్తారని, ఆడవారిచే లగేజీ కూడా మోయించరని, విలువల గురించి చెబుతారని మరొకరు అన్నారు. ఆయన అలా చేశారంటే బాధేస్తోందన్నారు. ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలా చేశారన్నారు. ఆయన గిన్నిస్ బుక్కులోకి ఎక్కారని, మరోసారి ప్రయత్నం చేస్తున్నారని, ఇవన్నీ కొందరు ఓర్చుకోలేకపోతున్నారన్నారు. గజల్ శ్రీనివాస్‌విగా చెబుతున్న వీడియోలు పోలీసుల వద్ద ఉన్నాయని, కోర్టులో తేలుతుందని చెప్పారు.

  అంత ధైర్యం చేసిన అమ్మాయి

  అంత ధైర్యం చేసిన అమ్మాయి

  బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వీడియోలు సరైనవని ఎలా చెప్పగలగమని మరో సన్నిహితుడు అన్నారు. ఆయన గదిలో, ఆయన బెడ్రూంలో కెమెరాలు పెట్టి వీడియోలు తీసిన ధైర్యవంతమైన ఆ అమ్మాయి మొదట్లోనే ఎందుకు ఇలా చేయలేకపోయిందని ప్రశ్నించారు. ఎనిమిది నెలల తర్వాత చేయడం ఏమిటన్నారు. ఎనిమిది నెలల తర్వాత వచ్చి రెండు నెలల నుంచి వేధింపులు అనడం విడ్డూరమన్నారు. నిజమే అయితే ఎస్కే అయ్యేందుకు ఎందుకు ప్రయత్నాలు చేయలేదన్నారు. వేధిస్తుంటే ఉద్యోగం ముఖ్యమా అన్నారు.

  ఎక్స్‌పీరియెన్స్ అంటోంది కానీ డిగ్రీ సర్టిఫికేట్ అనడం లేదు

  ఎక్స్‌పీరియెన్స్ అంటోంది కానీ డిగ్రీ సర్టిఫికేట్ అనడం లేదు

  ఆ అమ్మాయి పదేపదే ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికేట్ కోసం తాను అక్కడ ఉన్నానని చెబుతోందే తప్ప, తన డిగ్రీ సర్టిఫికెట్ కోసమని మాత్రం చెప్పలేదని ఆయన చెప్పారు. వారం, పది రోజులు పని చేసి ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికేట్ కోసం అంటే ఎలా అన్నారు. తనకు గజల్ శ్రీనివాస్‌తో ముప్పై ఏళ్ల పరిచయం ఉందని, ఆయనలో ఇలాంటి కోణం ఎప్పుడూ చూడలేదన్నారు.

  ఈయనే గజల్ శ్రీనివాస్ అంటే ఎలా నమ్ముతాం

  ఈయనే గజల్ శ్రీనివాస్ అంటే ఎలా నమ్ముతాం

  ముప్పై ఏళ్లుగా తనకు తెలిసిన గజల్ శ్రీనివాస్‌ను, ఇ రోజు వచ్చి వీడియోలు చూపించి అతనే శ్రీనివాస్ అంటే ఎలా నమ్ముతామని, అతని క్యారెక్టర్ తమకు తెలుసునని, అలాంటప్పుడు ఆయన ఇలా చేశాడంటే ఎలా నమ్మాలని వ్యాఖ్యానించారు. అసలు అమ్మాయి ఎంత వరకు కరెక్ట్ అని, ఆ అమ్మాయి మొదట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది అన్నారు. అలా చేస్తే నమ్మి ఉండేవాళ్లమమన్నారు.

  కావాలని పెట్టినట్లే, మార్ఫింగ్ అనుకుంటున్నాం

  కావాలని పెట్టినట్లే, మార్ఫింగ్ అనుకుంటున్నాం

  కానీ ఎనిమిది నెలల తర్వాత నేర్పుగా కెమెరాలు పెట్టి, వీడియోలు తీసిందంటే కావాలని పెట్టినట్లు కాదా అన్నారు. అసలు మీడియా పట్టించుకోని విషయం ఏమంటే ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా అని గుర్తించాలన్నారు. కెమెరాలు ఫిక్స్ చేయాలంటే ఆమెకు ఎవరి సహాయమైనా కావాలన్నారు. అసలు ఆ వీడియోలు నిజమని ఇప్పుడు ఎలా చెప్పగలుగుతామని, అవి తాము మార్ఫింగ్ అనుకుంటున్నామని, కోర్టులో తేలిన తర్వాత నమ్ముతామన్నారు. ఇప్పటికైతే తాము మార్ఫింగ్ అనుకుంటున్నామని చెప్పారు.

   పార్వతిని కూతురులా, బాధితురాలిని బలవంతం చేయలేదు

  పార్వతిని కూతురులా, బాధితురాలిని బలవంతం చేయలేదు

  మొదటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే థ్రెట్ అని భయపడిన ఆమె, ఇప్పుడు ఎలా ఫిర్యాదు చేసిందని ప్రశ్నించారు. గజల్ శ్రీనివాస్ ఆడవారిని ప్రేమించే వారు అని, పార్వతి గురించి మాట్లాడుతూ.. పార్వతి ఆయన వద్ద చిన్నప్పటి నుంచి పెరిగిందని, ఆయన కూతురులా చూసుకుంటారని చెప్పారు. కాళ్లు, చేతులు పడితే తప్పేమిటని ప్రశ్నించారు. గజల్‌పై వచ్చిన ఆరోపణలు కోర్టు చెప్పిన తర్వాతే నమ్ముతానని, అప్పటి దాకా నమ్మనని చెప్పారు. బాధితురాలని గజల్ శ్రీనివాస్ బలవంతం చేసినట్లు ఎక్కడా లేదన్నారు. పార్వతి కూడా చెప్పిందని అంటోందని, అదే నిజమైతే సలహా ఇచ్చిందేమోనని, పాటించడం పాటించకపోవడం ఆమె ఇష్టమని, మసాజ్ బలవంతంగా చేయించలేదన్నారు. ఇదిలా ఉండగా, గజల్ శ్రీనివాస్ పైన ప్రతి ఆధారం తన వద్ద ఉందని, తనను వేధించినందు వల్ల మరో మహిళకు ఇలా జరగవద్దనే తాను అతని బండారం బయటపెట్టినట్లు ఓ ఛానల్లో వివరణ ఇచ్చారు. పోలీసులు కూడా అతనిని నాలుగు రోజుల కస్టడీకి అడిగారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Punjagutta police said a local court here on Wednesday posted the request of the police for four-day custody of Kesiraju Srinivas, popularly known as Ghazal Srinivas for hearing on Thursday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి