శిరీషను ట్రాప్ చేసేందుకు శ్రవణ్ ప్లాన్, స్టేషన్లో సిసి కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదు?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బ్యూటీషీయన్ శిరీషను ట్రాప్ చేసేందుకు ఏడాదిగా శ్రవణ్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.శిరీషను ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డికి శ్రవణ్ కాల్ గర్లను పంపేవాడని పోలీసులు ఈ రిపోర్ట్ లో చెప్పారు.

బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య, కుకునూర్ పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి మరణానికి సంబంధించిన ఈ రెండు కుటుంబాల సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసుల వాదన మాత్రం భిన్నంగా ఉంది.

బ్యూటీషీయన్ శిరీషది ఆత్మహత్యది కాదంటున్నారు కుటుంబసభ్యులు. శిరీషను హత్య చేశారని తల్లి , సోదరి ఆరోపించారు.మరోవైపు ఇదే రకమైన అభిప్రాయాన్ని ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు కూడ ఆరోపిస్తున్నారు.రెండు ఆత్మహత్యల వెనుక అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏడాదిగా ట్రాప్ చేసేందుకు శ్రవణ్ ప్రయత్నం

ఏడాదిగా ట్రాప్ చేసేందుకు శ్రవణ్ ప్రయత్నం

శిరిషతో పరిచయం ఏర్పడిన తర్వాత ఆమెను ట్రాప్ చేసేందుకు అవకాశం కోసం శ్రవణ్ ఎదురుచూశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.తన వద్దకు ఓ అమ్మాయి వచ్చిందని ఆమెకు సహయం చేస్తే ఆమె హెల్ప్ అవుతోందని శ్రవణ్ ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డికి ఫోన్ లో శ్రవణ్ చెప్పారని రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. ఎస్ ఐ తో శ్రవణ్ చాలాసార్లు విందులు, వినోదాల్లో మునిగితేలేవాడన్నారు. శ్రవణ్ తరచుగా ఎస్ ఐ కోరిన ఫాంహౌజ్ కు అమ్మాయిలను పంపేవాడని పోలీసులు రాబట్టారు.ఈ నెల 12వ, తేది సాయంత్రం శ్రవణ్. రాజీవ్, శిరీష, పలుమార్లు ఎస్ ఐ తో మాట్లాడారు.

అందంగా ఉందంటూ చాట్ చేసిన శ్రవణ్

అందంగా ఉందంటూ చాట్ చేసిన శ్రవణ్

శిరీష ఫోటోను వాట్సాప్ ద్వారా శ్రవణ్ ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డికి పంపారు. అయితే ఫోటోల్లో కన్నా ఫిగర్ మరీ అందంగా ఉందంటూ వాట్సాప్ చాట్ చేశారు శ్రవణ్. శ్రవణ్ ను పోన్ ని స్వాధీనం చేసుకొన్నారు పోలీసులు.ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డికి, శ్రవణ్ కు మధ్య జరిగిన చాట్ సమాచారాన్ని పోలీసులు కీలక సాక్ష్యంగా కోర్టుకు అందించారు. ఎస్ ఐ క్వార్టర్ కు వెళ్ళిన తర్వాత పలుమార్లు రాజీవ్ ను తీసుకొని శ్రవణ్ ను బయటకు వెళ్ళడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఆ రిపోర్ట్ లో రాశారు.

సిసి కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదు

సిసి కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదు


కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో సిసి కెమెరాలు ఏమయ్యాయి. అసలు కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు రాజీవ్, శ్రవణ్, శిరీష వెళ్ళిన సమయంలో ఎలా ఉన్నారు. తిరిగి వచ్చే సమయంలో ఎలా ఉన్నారనే దృశ్యాలను చూస్తే తెలుస్తోంది. అయితే షాకింగ్ విషయమేమిటంటే ఈ పోలీస్ స్టేషన్ లో సిసి కెమెరాలు పనిచేయడం లేదు. అయితే సిసి కెమెరాల్లోని డేటాను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ పోలీస్ స్టేషన్ లో సిసి కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. హర్డ్ డిస్క్ ను నిపుణులు పరిశీలనకు పంపారు. దీనిపై ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాకర్ రెడ్డి పై బురద చల్లే ప్రయత్నం

ప్రభాకర్ రెడ్డి పై బురద చల్లే ప్రయత్నం

ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డిపై బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.క్వార్టర్లో ఎస్ ఐ శిరీషపై అసభ్యంగా ప్రవర్తిస్తే ఆమె గట్టిగా అరిచిందని నిందితులు చెప్పినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు లేదా పక్కనే క్వార్టర్లో ఉన్న వారికి ఈ అరుపులు విన్పించవా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి మృతి విషయంలో కుటుంబసభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
police submitted to court between sravan and si prabhakar reddy chatiing information.Sravan trying to trap Sirisha past one year said police remand report.
Please Wait while comments are loading...