కూక‌ట్ ప‌ల్లిలో సుహాసిని ఎంట్రీతో మారిన రాజ‌కీయం..! ప్ర‌జాబ‌లం త‌న‌కే అంటున్న మాధ‌వ‌రం..!

Recommended Video

    Telangana Elections 2018 : రాజకీయ అలజడి కోసమే కూకట్ పల్లి లో రంగంలోకి సుహాసిని...! | Oneindia Telugu

    తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఓ ప్ర‌హ‌స‌నానికి తెర‌ప‌డ‌బోతొంది. నామినేష‌న్ల ప‌ర్వానికి నేటితో తెర‌ప‌డ‌బోతోంది. దీంతో రాజ‌కీయాలు మ‌రింత వేడిగా మారిపోయాయి. ముఖ్యంగా కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క వర్గంలో రాజ‌కీయం ఒక్క‌సారిగా మారిపోయింది. మ‌హాకూట‌మి అభ్య‌ర్థిగా నంద‌మూరి కుటుంబం నుండి హ‌రిక్రిష్ణ కుమార్తె సుహాసిని ని ఎన్నిక‌ల బ‌రిలో దించుతోంది టీడిపి. దీంతో నియోజ‌క వ‌ర్గంలోని స‌మీక‌ర‌ణాల‌న్ని ఒక్క‌సారిగా మారిపోయాయి. ప్ర‌శాంతంగా ఉండే కూక‌ట్ ప‌ల్లి రాజ‌కీయాల్లో అల‌జ‌డి తీసుకొచ్చేందుకే టీడిపి నంద‌మూరి వార‌సురాలిని రంగంలోకి దించిందంటూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మాధ‌వ‌రం క్రిష్ణారావు ఘాటుగా విమ‌ర్శిస్తున్నారు.

    సుహాసిని చెల్లెలుతో స‌మానం..! ఎవ‌రొచ్చినా గెలుపు త‌న‌దే అంటున్న మాధ‌వ‌రం..!!

    సుహాసిని చెల్లెలుతో స‌మానం..! ఎవ‌రొచ్చినా గెలుపు త‌న‌దే అంటున్న మాధ‌వ‌రం..!!

    అంతే కాకుండా నంద‌మూరి కుటుంబంతో త‌న‌కు ముప్పై ఏళ్లుగా అనుబందం ఉందని, సుహాసిని త‌న‌కు చెల్లితో స‌మాన‌మ‌ని మాధ‌వ‌రం అంటున్నారు. కూక‌ట్ ప‌ల్లి ప్ర‌జానికం మొత్తం టీఆర్ఎస్ వైపే ఉన్నార‌ని, బ‌ల‌మైన త‌న‌ను ఎదుర్కొనే ధైర్యం ఎవ‌రీకి లేక‌నే నంద‌మూరి కుటుంభం నుండి సుహాసినిని రంగంలోకి దించార‌ని ఆరోపిస్తున్నారు మాధ‌వ‌రం. ఎవ‌రు ఎన్న కుట్ర‌లు చేసినా త‌న గెలుపును ఎవ్వ‌రూ నిలువ‌రించ‌లేర‌ని ధీమా వ్య‌ర్తం చేస్తున్నారు మాధ‌వ‌రం క్రిష్ణారావు.

    కూక‌ట్ ప‌ల్లిలో ఒక్క‌సారిగా మారిన రాజ‌కీయం..! ప్ర‌చారానికి సిద్ద‌మౌతున్న నంద‌మూరి ఫామిలీ..!!

    కూక‌ట్ ప‌ల్లిలో ఒక్క‌సారిగా మారిన రాజ‌కీయం..! ప్ర‌చారానికి సిద్ద‌మౌతున్న నంద‌మూరి ఫామిలీ..!!

    సుహాసినిని బరిలో దింపితే నందమూరి కుటుంబం మొత్తం మద్దతు తెలుపుతుంది. వ్యతిరేకించే వారు ఎవరూ ఉండరు. సుహాసిని తరపున బాలకృష్ణతో పాటు, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సహా.. కుటుంబం అంతా ప్రచారం చేయడం దాదాపుగా ఖాయమైంది. అన్ని నియోజకవర్గాల్లో బాలకృష్ణ ప్రచారం చేసినా, కూకట్ పల్లిలో కుటుంబం అంతా కలసి రావడం ఖాయం. అదే జరిగిదే, నందమూరి కుటుంబం మొత్తం ఏకతాటిపై ఉందని, అది కూడా తెలుగుదేశం పార్టీ వెనుకే ఉందనే బలమైన సంకేతాలను ప్రజల్లోకి పంపినట్లవుతుంది. ఈ అంశంలో టీడిపి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

    కూక‌ట్ ప‌ల్టిలో సుహాసిని గులుపు ఖాయం..! ధీమా వ్య‌క్తం చేస్తున్న కూట‌మి..!

    కూక‌ట్ ప‌ల్టిలో సుహాసిని గులుపు ఖాయం..! ధీమా వ్య‌క్తం చేస్తున్న కూట‌మి..!

    కూకట్ పల్లిలో సుహాసిని బరిలోకి దిగడం, తెలుగుదేశం పార్టీకి తెలగాణలో కీల‌కం కానుంది. నంద‌మూరి తార‌క‌రామారావు పార్టీ స్థాపించింది తెలంగాణ‌లో కాబ‌ట్టి, తెలంగాణ రాజ‌కీయాల్లో ఎంటీఆర్ వార‌సులు ఉంటే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉంటుంద‌నే చర్చ‌కూడా జ‌రుగుతోంది. అందుకే అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల త‌ర్వాత ఈ సారి తెలంగాణ ఎన్నిక‌ల్లో నంద‌మూరి వార‌సురాలిని రంగంలోకి దించుతున్న‌ట్టు తెలుస్తోంది.

    సంయ‌మ‌నం పాటిస్తున్న క్రిష్ణ‌రావు..! ప్ర‌తిప‌క్షాలు త‌న‌పై రాజ‌కీయం చేస్తున్నాయ‌ని ఆరోప‌ణ‌..!

    సంయ‌మ‌నం పాటిస్తున్న క్రిష్ణ‌రావు..! ప్ర‌తిప‌క్షాలు త‌న‌పై రాజ‌కీయం చేస్తున్నాయ‌ని ఆరోప‌ణ‌..!

    ఇక ఇదే పరిణామం ప‌ట్ల కూక‌ట్ ప‌ల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మాధ‌వరం క్రిష్ణారావు ఆచితూచి స్పందిస్తున్నారు. కూక‌ట్ ప‌ల్లిలో సుహాసిని నామినేష‌న్ వేసిన ద‌గ్గ‌ద‌ర‌నుండి రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌కుండా ప్ర‌చారంపై మ‌రింత ఫోక‌స్ పెంచారు. కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క వ‌ర్గంలో అత్యంత ప్ర‌జాబ‌లం ఉన్న త‌న‌ను రాజ‌కీయంగా నిటువ‌రించే శ‌క్తి ఎవ‌రికి లేద‌ని చెప్పుకొస్తున్నారు. అంతే గాని త‌న ప్ర‌త్య‌ర్థి ఐన సుహాసిని పైన ఎలాంటి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం లేదు. ప్ర‌జాల గురించి అలోచించే నాయ‌కుడు వారి స‌మ‌స్య‌ల గురించి ఆలోచించాలి గాని గెలుపు ఓట‌ముల గురించి కాద‌ని ఆయ‌న అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+