ప్రేమే కారణమా?: తల్లిదండ్రుల ముందే భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రుల కళ్ల ముందే హస్టల్ భవనంపై నుంచి దూకి పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం ముషీరాబాద్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపిగుంటకు గ్రామానికి చెందిన మహ్మద్ సనా ముషీరాబాద్ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ పాలిటెక్నిక్ చదువుతోంది.

సనా ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి బుధవారం కళాశాలకు వచ్చారు. దీంతో సనా తల్లిదండ్రుల ముందే హాస్టల్ భవనం మూడో అంతస్తు మీద నుంచి కిందకు దూకింది.
తీవ్రగాయాలపాలైన ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications