Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కెసిఆర్ వెళ్లగానే భారీ వర్షాలు.. చైనాలోనే ఉండు, ఏపీతో పోటీపడు: పొన్నం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిఎం కెసిఆర్ చైనా పర్యటనకు వెళ్లగానే వర్షాలు పడ్డాయని, కేవలం లింబయ్య మృతి విషయంలోనే ప్రభుత్వం నివేదిక ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు.

రాష్ట్రంలో 1300 మంది రైతులు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. రాజధానిలో ఆత్మహత్య చేసుకున్న ఒక్క లింబయ్య మృతి విషయంలోనే నివేదిక ఎందుకు ఇచ్చారని నిలదీశారు. రుణమాఫీ, మద్దతు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇస్తున్నారని, మరి మిగతా జిల్లాలలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అప్పుల్లో కూరుకుపోయిన ఏపీతో పోటీ పడి ధనిక రాష్ట్రమైన తెలంగాణ రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Ponnam says heavy rains, after KCR leave Telangana

కెసిఆర్ చైనా వెళ్లగానే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయన్నారు. కెసిఆర్ చైనా నుంచి రాష్ట్రానికి వచ్చనా ఎటూ ఆయన ఫాంహౌస్ నుంచే పరిపాలన చేస్తారు కాబట్టి ఇంకా రెండేళ్లపాటు చైనాలోనే ఉంటే వర్షాలు కురుస్తాయన్నారు.

రాష్ట్రంలో వందలమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం వాటి పైన ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. రాజధాని నడిబొడ్డున లింబయ్య ఆత్మహత్య ఘటనను కూడా ప్రభుత్వ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బతికే అవకాశమున్న తెలంగాణ కావాలన్నారు.

ముష్టివేసినట్లు మాఫీనా: కోమటిరెడ్డి

ముష్టివాళ్లకు బిక్షం వేసినట్లు దఫాల వారిగా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరమని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల ఆత్మహత్యల పైన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రూ.3 కోట్లతో ప్రత్యేక విమానంలో చైనా వెళ్లేందుకు ప్రభుత్వం వద్ద డబ్బుంది కానీ, రైతు కుటుంబాలను ఆదుకునేందుకు లేవా అని ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+