వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఆస్తుల కేసు: ఎట్టకేలకు ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి కీలక పోస్టింగ్‌

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు మించిన ఆదాయం కేసులో, అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొన్న ఐఏఎస్ శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది.

తెలంగాణలో 1988 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి వై.శ్రీలక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమిస్తూరాష్ట్ర ప్రభుత్వం గురువారంఉత్తర్వులిచ్చింది.

 Posting for IAS Srilakshmi

2011లో అక్రమ మైనింగు కేసులో శ్రీలక్ష్మి అరెస్టవడంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆమెను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆమె జైలు నుంచి బెయిల్‌పై విడుదలయిన తర్వాత సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. ఈ క్రమంలో ఐఏఎస్‌ కేటాయింపుల్లో ఆమెను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు.

చాలా రోజులుగా తనకు పోస్టింగుఇవ్వడం లేదని శ్రీలక్ష్మి కేంద్రప్రభుత్వాన్ని ఆశ్రయించగా.. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాలశాఖ దీనిపై తెలంగాణప్రభుత్వానికి లేఖరాసింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం ఆమెకు తాజాగా పోస్టింగ్‌ ఇచ్చింది.

English summary
Posting for IAS Srilakshmi in Telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X