ప్రజాగోస-బీజేపీ భరోసా.. కదిలిన కాషాయదళం; సిద్ధిపేట,వేములవాడలలో బైక్ ర్యాలీలో బండి సంజయ్!!

తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తున్న బీజేపీ మరో కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో భారీ ఎత్తున బైక్ ర్యాలీలతో రంగంలోకి దిగింది. బీజేపీని జనాల్లోకి బాగా తీసుకెళ్లటం, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యటంపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్న బీజేపీ అధినాయకత్వం నేటి నుండి ప్రజా గోస - బీజేపీ భరోసా బైక్ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు ఐదారు గ్రామాలలో కొనసాగే ఈ బైక్ ర్యాలీల కార్యాచరణ ఇప్పటికే సిద్ధం చేసిన బీజేపీ నాయకులు నేటి నుండి బైక్ ర్యాలీలతో హోరెత్తించనున్నారు.

మొదలైన బీజేపీ బైక్ ర్యాలీలు.. సిద్దిపేటలో బండి సంజయ్


తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు స్థానిక సమస్యలను గుర్తించటం, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు భరోసా ఇవ్వడం, తమకు అధికారం కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం లక్ష్యంగా బీజేపీ బైక్ ర్యాలీలను ప్రారంభించింది.ఇందులో భాగంగా పది రోజులపాటు బైక్ లతో గ్రామాలను చుట్టేయనున్నారు నేతలు. ప్రజా గోస - బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్దిపేటలో ప్రారంభించారు.

నాంచార్ పల్లి నుండి బైక్ ర్యాలీలు ప్రారంభించిన బండి సంజయ్ , ఆపై వేములవాడలో


బైక్ ర్యాలీ కోసం సిద్దిపేటకు వెళ్ళిన బండి సంజయ్ కు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. సిద్దిపేట లోని నాంచార్ పల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి డప్పు చప్పుళ్ళ మధ్య అనంతరం బైక్ ర్యాలీని ప్రారంభించారు. అత్యంత ఉత్సాహంతో బీజేపీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఈ ర్యాలీలో బండి సంజయ్, మధ్యప్రదేశ్ బీజేపీ ఇంచార్జి మురళీధర్ రావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వేములవాడలోనూ బైక్ ర్యాలీలో పాల్గోననున్న బండి సంజయ్

వేములవాడలోనూ బైక్ ర్యాలీలో పాల్గోననున్న బండి సంజయ్


బైక్ ర్యాలీ అనంతరం బండి సంజయ్ అక్కడి నుండి ఆయన వేములవాడ బయలుదేరనున్నారు. వేములవాడ నియోజకవర్గంలోని ఫాజుల్ నగర్ లో బైక్ ర్యాలీని ప్రారంభించనున్నారు. ఈ బైక్ ర్యాలీ ద్వారా గ్రామ గ్రామాన కాషాయ జెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వేములవాడలో యెండల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ బైక్ ర్యాలీల రెస్పాన్స్ ను బట్టి మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు.

 ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్రలో మొదటగా 6 నియోజకవర్గాలలో ప్లాన్

ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్రలో మొదటగా 6 నియోజకవర్గాలలో ప్లాన్


ఇదిలా ఉంటే ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్రలో మొదటగా ఎంపిక చేసిన 6 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు బీజేపీ నేతలు. తాండురు నియోజకవర్గానికి డీకే అరుణ, బోధన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్, వేములవాడకు యెండల లక్ష్మీనారాయణ, జుక్కల్ కు వివేక్ వెంకటస్వామి, సిద్దిపేటకు పీ మురళీధర్ రావు, నర్సంపేటకు రఘునందన్ రావును నియమించారు. పదిరోజుల పాటు బైక్ లపై గ్రామాల్లో పర్యటించి వివిధ వర్గాల ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోవటంతో పాటుగా బీజేపీ తెలంగాణా ప్రజలకు ఏం చేస్తుంది, కెసీఆర్ తెలంగాణా ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాడు అన్నది చెప్పనున్నారు బీజేపీ నేతలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+