ప్రణయ్ పరువు హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2018 సెప్టెంబర్ 14న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్‌ను, అతని భార్య అమృత ఎదుటే నడిరోడ్డుపై దారుణంగా నిరికి చంపారు. ఈ ఘటనలో అమృత తండ్రే ప్రధాన ముద్దాయి కాగా.. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రణయ్ ను కులాంతర వివాహం చేసుకున్నందుకు అమృత తండ్రి మారుతిరావు శ్రవణ్ కుమార్‌ సుఫారీ కిల్లర్ ద్వారా నడిరోడ్డపై హతం చేయించాడు. 2018 నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. సుదీర్ఘ విచారణ అనంతరం నల్లగొండ జిల్లా కోర్టు గతేడాది కీలక తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రవణ్ కుమార్ తో పాటు ఇతర నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు వెలువడినప్పుడు బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందన్న భావన సమాజంలో వ్యక్తమైంది.

Pranay Case Takes New Turn High Court Grants Conditional Bail to Main Accused Shravan Kumar

జీవిత ఖైదు శిక్షపై అప్పీల్

జిల్లా కోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై విధించిన జీవిత ఖైదు శిక్షపై అప్పీల్ దాఖలు చేసిన అతడు, అప్పీల్‌పై తుది విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని కోరుతూ మధ్యంతర దరఖాస్తు వేశాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంది.

ఎందుకు బెయిల్ ఇచ్చింది?

నిందితుడు ఇప్పటికే గణనీయమైన కాలం జైలులో ఉండటం, అతని వయస్సు, అప్పీల్ విచారణకు పట్టే సమయం వంటి అంశాలను కోర్టు గమనించింది. అప్పీల్ కేసుల తుది విచారణకు ఆలస్యం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, తాత్కాలికంగా బెయిల్ ఇవ్వాలని ధర్మాసనం నిర్ణయించింది. అయితే ఇది పూర్తి విముక్తి కాదని, కేవలం అప్పీల్ పరిష్కారం వచ్చే వరకు మాత్రమే వర్తించే బెయిల్ అని కోర్టు స్పష్టంగా పేర్కొంది.

కఠిన షరతులు విధించిన హైకోర్టు

శ్రవణ్ కుమార్ రూ.25 వేల విలువైన వ్యక్తిగత బాండ్ సమర్పించాలి. అదేవిధంగా మరో రూ.25 వేల మొత్తానికి ఇద్దరు పూచీకత్తుదారులను చూపించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు విధించిన షరతులను కచ్చితంగా పాటించాలని, ఏదైనా ఉల్లంఘన జరిగితే బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.

కొత్త దశలోకి కేసు

హైకోర్టు బెయిల్ మంజూరుతో ప్రణయ్ హత్య కేసు మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. అప్పీల్ విచారణలో జిల్లా కోర్టు తీర్పు నిలబడుతుందా? లేక నిందితులకు ఉపశమనం లభిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ తీర్పుపై అమృత ఇంకా రియాక్ట్ అవ్వలేదు. మరోవైపు నిందితుడి న్యాయవాదులు మాత్రం హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అప్పీల్ విచారణలో బలమైన వాదనలు వినిపిస్తామని చెబుతున్నారు. ప్రణయ్ హత్య కేసు ఇప్పటికీ సమాజాన్ని కదిలిస్తున్న నేపథ్యంలో, హైకోర్టు తుది తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+