వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబాయ్, కొడుకు గురించి సంచలన విషయాలు చెప్పిన అమృత వర్షిణి

|
Google Oneindia TeluguNews

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తన భర్త ప్రణయ్ దారుణ హత్యకు గురి కావడంతో భార్య అమృత వర్షిణి తన పేరెంట్స్ పైన తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఈ హత్య కేసులో నిందితులుగా భావిస్తున్న అమృత వర్షిణి తండ్రి మారుతీ రావు, బాబాయ్ శ్రవణ్ గురించి ఆమె సంచలన విషయాలను బయటపెట్టారట.

నాన్న అందుకే ఫోన్ చేశాడని ఇప్పుడర్థమైంది: అమృత, ప్రణయ్‌పై గతంలోను...నాన్న అందుకే ఫోన్ చేశాడని ఇప్పుడర్థమైంది: అమృత, ప్రణయ్‌పై గతంలోను...

 తండ్రితో పాటు బాబాయ్‌ది నేరప్రవృత్తి

తండ్రితో పాటు బాబాయ్‌ది నేరప్రవృత్తి

తన తండ్రి మారుతిరావుతో పాటు బాబాయ్ కూడా నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిులు అని చెప్పారు. ఆయన వివాహేతర సంబంధాలు కూడా పెట్టుకున్నాడని చెప్పారని తెలుస్తోంది. వాళ్ల కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అమృత చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

బాబాయ్ కొడుకుపై అమృత వర్ణిణి

బాబాయ్ కొడుకుపై అమృత వర్ణిణి

తన బాబాయి కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని తాను తన బాబాయికి చెబితే.. అబ్బాయిలు అలానే ఉంటారని, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడని ఆమె అన్నారట. ఈ సంఘటన జరిగినప్పుడు తన బాబాయ్ కొడుకు ఎనిమిదో తరగతి చదువుతున్నాడని, తాను బీటెక్ చదువుతున్నానని ఆమె చెప్పింది.

 బాబాయ్ కొడుకు అలా చేస్తుంటే

బాబాయ్ కొడుకు అలా చేస్తుంటే

తన బాబాయి కొడుకు పోర్న్ మూవీస్ చూస్తుంటే తాను వాళ్ల అమ్మకి చెప్పానని, అలా చూడకుంటే వాడు అబ్బాయి ఎలా అనుకుంటారని చెప్పిందని అమృత వాపోయారు. ఆమె తన కొడుకునే వెనుకేసుకు వచ్చిందన్నారు. ఓ తల్లి నుంచి అలాంటి సమాధానం ఊహించలేదని చెప్పారు. తనతో పాటు బంధువుల్లో ఉన్న చాలామంది అమ్మాయిలతో తన బాబాయ్ కొడుకు తప్పుగా ప్రవర్తించాడని పేర్కొన్నారు.

ప్రణయ్ హత్య అనాగరికం

ప్రణయ్ హత్య అనాగరికం

కాగా, పలు ప్రజాసంఘాల నాయకులు ప్రణయ్‌ భౌతికకాయం వద్ద ఆదివారం నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రణయ్‌ను దారుణంగా హత్య చేసిన వారితో పాటు కుట్రదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అంత్యక్రియలకు గోరటి వెంకన్న, టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రణయ్‌ హత్య అత్యంత అనాగరికమన్నారు.

English summary
"No complaints nor petitions were filed with the police else we would have given police protection to the couple," says police investigating the alleged caste killing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X