సవతి తల్లి ఇంటి అద్దెను ప్రత్యూషకే అందించండి: హైకోర్టు
హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష కేసులో హైకోర్టు సోమవారం విచారించింది. తన సవతి తల్లి ఇంటిపై వస్తున్న అద్దెను ప్రత్యూషకే అందేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది.
ప్రత్యూష సవతి తల్లి ఉంటోన్న ఇల్లు కిరాయి డబ్బులు ఎంత వస్తున్నాయో తెలుసుకుని కోర్టుకు చెప్పాలని ఆదేశించారు. ఆ డబ్బును ప్రత్యూష ఖాతాలో జమచేయాలని పేర్కొన్నారు. తదుపరి కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
కాగా, ప్రత్యూష చిత్ర హింసలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలకు స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు ఆమెను కలిసి భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్రత్యూష ఎప్పుడు అవసరమైన తన ఇంటికి వచ్చి ఉండవచ్చని, ఆందోళన చెందొద్దని కూడా సీఎం దంపతులు ఆమెకు తెలిపారు. సిఎం కెసిఆర్ ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లిన ప్రత్యూష అక్కడే భోజనం చేసిన విషయం తెలిసిందే.
ఇటుక బట్టీ కార్మికుల సంక్షేమంపై ప్రశ్నించిన హైకోర్టు
ఇటుక బట్టీలో పనిచేస్తోన్న కార్మికుల దుర్బరస్థితిపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇటుక బట్టీ కార్మికుల సంక్షేమం కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించింది. రెండు వారాల్లోగా కోర్టుకు నివేదిక అందజేయాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications