వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రి-పెయిడ్‌ మీటర్లు వచ్చేస్తున్నాయ్‌..!: ప్రయోగాత్మకంగా ప్రభుత్వ కార్యాలయాల్లో బిగింపు

ఇక నుంచి రీఛార్జీ చేస్తేనే విద్యుత్తు వెలుగులు ప్రసరించనున్నాయి. వినడానికి విడ్డూరంగా ఉందంటారా..?

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: ఇక నుంచి రీఛార్జీ చేస్తేనే విద్యుత్తు వెలుగులు ప్రసరించనున్నాయి. వినడానికి విడ్డూరంగా ఉందంటారా..? నిజమేనండి బాబోయ్‌.. బకాయిల భారం తప్పించేందుకు ట్రాన్స్‌కో వినూత్న రీతిలో కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టబోతోంది.

అవసరానికి మించి విద్యుత్తు వినియోగం.. మొండి బకాయిలు.. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో ట్రాన్స్‌కో మూటకట్టుకున్న నష్టాల నుంచి గట్టెక్కేంచేందుకు ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించింది.

విద్యుత్తు ఆదా చేస్తూ లాభాల బాట పట్టించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న మీటర్లను తొలగించి వీటి స్థానంలో ప్రీ-పెయిడ్‌ మీటర్లను అమర్చనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి కూడా పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోతున్నాయి. అందుకే ముందస్తుగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే బిగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Prepaid power bills

ఈ విధానం అమలైతే ట్రాన్స్‌కో ఆర్థిక పరమైన సమస్యల నుంచి ఉపశమనం పొందనుంది. దీనికి సంబంధించిన ప్రక్రియపై ఇప్పటికే అధికారులకు సమాచారం అందించారు. త్వరలో జిల్లాలో అమలు చేసేందుకు ట్రాన్స్‌కో అధికారులు సిద్ధమవుతున్నారు.

నష్టాల నుంచి గట్టెక్కించేందుకే

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్తు వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. నిమిషం కరెంట్‌ కట్‌ చేస్తే భరించలేని ఉక్కపోతతోపాటు ఇతర పనులు నిలిచిపోతున్నాయి. వినియోగం అధికంగా ఉండటంతో బిల్లులు చెల్లింపులు భారమవుతున్నాయి. పట్ట పగలే విద్యుత్తు వెలుగులతో దుబారా అవుతోంది. వినియోగదారులు కూడా బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తుండటంతో రూ. కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, తాగునీటి పథకాలకు సంబంధించి ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గ్రామపంచాయతీలకు మంజూరు చేస్తున్న 14 ఆర్థిక సంఘం నిధుల్లో అధికంగా విద్యుత్తు అవసరాలకు కేటాయిస్తుండటంతో గ్రామాల అభివృద్ధికి విఘాతం కల్గుతోంది. గ్రామాల్లో కూడా అనధికారికంగా కనెక్షన్లు ఉండటంతో విద్యుత్తు వినియోగంపై భారంపడుతోంది.

Prepaid power bills

ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో బిగింపు

కోట్లలో బకాయిలు ఉండటంతో పలుమార్లు కనెక్షన్‌ తొలగించినప్పటికీ బకాయిలు రావడం కష్టంగా మారింది. దీంతో ప్రీ-పెయిడ్‌ మీటర్లను ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో రీఛార్జీ ఎలా చేస్తారంటేవిద్యుత్తు వృథాకు అడ్డుకట్ట వేసేందుకు ఈ విధానం అమలు చేయనున్నారు. ఎంత అవసరం ఉందో దానికి తగ్గట్టుగా ముందుగానే డబ్బులు చెల్లించాలి. ప్రస్తుతం చరవాణిలో రీఛార్జి ఎలా చేస్తున్నారో అదే విధంగా విద్యుత్తు అవసరాలకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మీటర్లను తొలగించి వీటి స్థానంలో ప్రీ-పెయిడ్‌ మీటర్లు బిగించనున్నారు.

Prepaid power bills

ప్రస్తుతం ఉన్న బిల్లులను అనుసరించాల్సి ఉంటుంది. రూ.1 వెయ్యి నుంచి రూ.20 వేల వరకు ఛార్జీ చేసుకునే వెసులుబాటు ఉంది. కార్డులో డబ్బులు ఉన్నంత వరకు సరఫరా అవుతుంది. డబ్బులు లేకుంటే ఆటోమెటిక్‌గా సరఫరా నిలిచిపోతుంది. దీంతో వినియోగదారులకు కూడా వినియోగంపై అవగాహన వస్తుంది. పొదుపుగా వినియోగిస్తారు. ఫలితంగా దుబారా తగ్గి టాన్స్‌కోకు ఆదాయం వస్తుంది.బిగించాలని నిర్ణయించారు. కార్యాలయాల్లో నిరంతరం వెలుగులు, గాలిపంకాలు, ఏసీలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీటర్లను బిగించనున్నారు. అక్రమ విద్యుత్తు వినియోగం, బకాయిలు రాబట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

English summary
Prepaid power bills
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X