ప్రధాని మోడీ పర్యటన: కిషన్ రెడ్డికి ప్రతిష్టాత్మకం; ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటే!!

భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాక కోసం వరంగల్ ముస్తాబవుతోంది. వరంగల్ నగరానికి మొట్టమొదటిసారిగా ప్రధాని నరేంద్రమోడీ వస్తుండడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక ఇప్పటికే మూడు రోజుల క్రితం నగరంలో పర్యటించిన బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోడీ సభ ఏర్పాట్లను గురించి సన్నాహక సమావేశం నిర్వహించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. ఇక మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన మంత్రి పర్యటనకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ డీఐజీ నవీన్ కుమార్ మెహతా ఆధ్వర్యంలో మూడు బృందాలు ఢిల్లీ నుంచి హనుమకొండ కు చేరుకొని మోడీ పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు.

Prime Minister Modi

హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ప్రధానమంత్రి మోడీ సభ జరగనున్న నేపథ్యంలో అక్కడ కూడా భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.కాజీపేట అయోధ్య నగర్ లో రైల్వే వ్యాగన్ ల తయారీ కేంద్రాన్ని శంకుస్థాపన చేయడంతోపాటు 6,110 కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ఆపై హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, అందునా మొదటి సారి వరంగల్ కు మోడీ రాక రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక మోడీ పర్యటన సక్సెస్ చేయాలని భావిస్తున్న బీజేపీ శ్రేణులు మోడీ సభకు జనసమీకరణ కు శ్రీకారం చుట్టారు.

Prime Minister Modi

మోడీ పర్యటన నేపధ్యంలో తాజాగా తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డి వరంగల్ కు రానున్నారు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ముగిసేవరకు కిషన్ రెడ్డి వరంగల్లోనే ఉండనున్నారు. వరంగల్ లోని పార్టీ పదాధికారులు, అధికార ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ సభ్యులు తమ పార్టీ ముఖ్య నేతలతో కలిసి ప్రధాని పర్యటనను సక్సెస్ చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత జరుగుతున్న తొలి కార్యక్రమమే ప్రధాని మోడీ పర్యటన కావడంతో దీనిని సక్సెస్ చేయడం ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇక మోడీ వరంగల్ పర్యటన బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులలోనూ ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+